కొడుకే కదా గేమ్స్ ఆడుకుంటాడులే అని ఫోన్‌ను ఇచ్చిందా తల్లి.. అదే ఆమె చేసిన పొరపాటయింది.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-04T22:31:25+05:30 IST

ఆమె ఓ ప్రభుత్వోద్యోగి. తప్పనిసరి పరిస్థితుల్లో మూడేళ్ల కొడుకును తనతో పాటు ఆఫీసుకు తీసుకెళ్లేది. అక్కడ ఆమె పనులతో బిజీబిజీగా ఉండేది. ఆ సమయంలో కొడుకు అల్లరి చేయకూడదని అడగ్గానే ఫోన్ ఇచ్చేది. గేమ్స్ ఆడుకుంటాడులే

కొడుకే కదా గేమ్స్ ఆడుకుంటాడులే అని ఫోన్‌ను ఇచ్చిందా తల్లి.. అదే ఆమె చేసిన పొరపాటయింది.. అసలేం జరిగిందంటే..

జైపూర్: ఆమె ఓ ప్రభుత్వోద్యోగి. తప్పనిసరి పరిస్థితుల్లో మూడేళ్ల కొడుకును తనతో పాటు ఆఫీసుకు తీసుకెళ్లేది. అక్కడ ఆమె పనులతో బిజీబిజీగా ఉండేది. ఆ సమయంలో కొడుకు అల్లరి చేయకూడదని అడగ్గానే ఫోన్ ఇచ్చేది. గేమ్స్ ఆడుకుంటాడులే అనుకుని ఆమె పని ఆమె చేసుకునేది. ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్‌కి బాబును అప్పగించేది. అదే ఆమె చేసిన పొరపాటయింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకెళ్లాల్సిందే..


రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన ఓ 30ఏళ్ల మహిళ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్యోగం చేస్తుంది. అక్కడే హేమారామ్ అనే వ్యక్తి సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అందిస్తానని మాయమాటలు చెప్పి, అతడు ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తరచూ మాట్లాడేవాడు. ఇదే క్రమంలో సదరు మహిళ తనతో పాటు కొడుకును కూడా ఆఫీసుకు తీసుకెళ్తుండేది. బాబు అక్కడ హేమరామ్‌తో పాటు కూర్చోని.. తల్లి ఫోన్‌లో గేమ్స్ ఆడుకునేవాడు.


అదే అవకాశంగా భావించిన సెక్యూరిటీగార్డ్ ఓరోజు ఆ బాలుడి దగ్గరినుంచి ఫోన్ తీసుకున్నాడు. మహిళకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను, వీడియోలను దొంగిలించాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి హోటల్‌కు రావాలని వేధించేవాడు. లేకపోతే ఫొటోలను, వీడియోలను వైరల్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసి, ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇలాగే చాలాసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హేమారామ్‌ని నెలక్రితం  ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆమెను ప్రతిరోజూ బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధించేవాడు. విసిగిపోయిన ఆమె చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

Updated Date - 2021-10-04T22:31:25+05:30 IST