గ్రామస్థుల స్టింగ్ ఆపరేషన్... ఆ పని చేస్తూ పట్టుబడ్డ ప్రిన్సిపాల్ సస్పెన్షన్...

ABN , First Publish Date - 2022-04-23T22:24:59+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల

గ్రామస్థుల స్టింగ్ ఆపరేషన్... ఆ పని చేస్తూ పట్టుబడ్డ ప్రిన్సిపాల్ సస్పెన్షన్...

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్ మధ్య అనుచిత సంబంధంపై ఆ గ్రామస్థులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరిద్దరూ పాఠశాలలోని స్టోర్ రూమ్‌లో అనుచిత రీతిలో లైంగిక, శృంగార కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండటాన్ని వారు చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 


ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని ప్రిన్సిపాల్ వేడుకుంటున్నట్లు వినిపిస్తున్న ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ అయింది. మరోవైపు గ్రామస్థులు జిల్లా కలెక్టర్ చందన్ కుమార్‌కు ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారి టీఆర్ సాహు చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ, గురువారం ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2022-04-23T22:24:59+05:30 IST