కనీవినీ ఎరుగని రీతిలో శునకాలకు పెళ్లి.. బంధువులందరికీ భోజనాలు.. డీజే పాటలతో ఊరంతా సందడే సందడి..!

ABN , First Publish Date - 2022-06-21T21:26:07+05:30 IST

కొన్ని ప్రాంతాల్లో కొందరి ఆచారాలు, సాంప్రదాయాలు, వారు నిర్వహించే కార్యక్రమాలు విచిత్రంగా అనిపిస్తాయి. మిగతా వారి కంటే ఏదైనా భిన్నంగా చేయాలనే తపనతో కొందరు వివిధ రకాలుగా..

కనీవినీ ఎరుగని రీతిలో శునకాలకు పెళ్లి.. బంధువులందరికీ భోజనాలు.. డీజే పాటలతో ఊరంతా సందడే సందడి..!

కొన్ని ప్రాంతాల్లో కొందరి ఆచారాలు, సాంప్రదాయాలు, వారు నిర్వహించే కార్యక్రమాలు విచిత్రంగా అనిపిస్తాయి. మిగతా వారి కంటే ఏదైనా భిన్నంగా చేయాలనే తపనతో కొందరు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. మరికొందరు నమ్మకం, విశ్వాసంతో తరాలుగా కొన్ని సాంప్రదాయాలు పాటిస్తుంటారు. బీహార్‌లోని ఓ ప్రాంతంలో కూడా ఇలాంటి విచిత్ర సాంప్రదాయం ఉంది. ఆ ప్రాంతంలో కుక్కలకు కనీవినీ ఎరుగని రీతిలో వివాహాలు జరిపిస్తుంటారు. అంతటితో ఆగకుండా బంధువులందరినీ పిలిచి భోజనాలు పెట్టించి, డీజే పాటలతో ఊరంతా సందడి సందడిగా గడుపుతారు. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం మోతీహారి పరిధిలో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మూడు రోజుల క్రితం మజురహా గ్రామంలో రెండు కుక్కలకు వివాహం ఘనంగా నిర్వహించారు. వివాహం అంటే ఏదో జరిపించాం అన్నట్లుగా కాకుండా.. మనుషుల పెళ్లి మాదిరిగానే వైభవంగా నిర్వహించారు. ముందుగా కుక్కల యజమానులైన నరేష్ సాహ్ని, సబితా దేవి.. వారి వారి కుక్కలకు కల్లు, బాసతి అని నామకరణం చేశారు. తర్వాత వాటిని అందంగా ముస్తాబు చేశారు. ఆడ కుక్కకు ఎర్రటి దుస్తులతో అలంకరించారు. అలాగే మగకుక్కకు కూడా పెళ్లి దుస్తులు వేశారు. సుమారు నాలుగు వందల మంది గ్రామస్తులు హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం మనుషుల వివాహం తరహాలోనే ఊరేగింపు నిర్వహించారు.

ఆ బాలికపై కొండముచ్చుకు నిజంగా పగ ఉందా.. లేకపోతే ఇలా చేసిందేంటీ..!


ఈ సందర్భంగా బ్యాండు మేళాలు, డీజే చప్పుల మధ్య.. డాన్సులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్రతం నిర్వహించిన అనంతరం వివాహం జరిపించారు. ఈ సందర్భంగా హాజరైన వారంతా కానుకలు కూడా సమర్పించారు. తర్వాత గ్రామస్తులందరికీ విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి వివాహాలు గతంలో ఎప్పుడూ చూడలేదంటూ కొందరు పేర్కొన్నారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ కుక్కలు భైరవ స్వరూపమని, వాటికి వివాహం జరిపించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిపారు. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీడేంట్రా.. అంత పెద్ద భవనం పైనుంచి ఇంత ఈజీగా దిగేశాడు.. ఇది రియలా.. లేక గ్రాఫిక్సా..

Updated Date - 2022-06-21T21:26:07+05:30 IST