మండలం కోసం అర్ధనగ్న ప్రదర్శన

Published: Mon, 08 Aug 2022 00:31:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 మండలం కోసం అర్ధనగ్న ప్రదర్శన అర్ధనగ్నంగా మోకాళ్లపై నిరసన తెలుపుతున్న మండల సాధన సమితి నేతలు

నార్కట్‌పల్లి, ఆగస్టు 7: అమ్మనబోలును మండ లం చే యాలనే డిమాండ్‌తో రెండు వారాలుగా దీక్ష చేస్తు న్న మండల సాధన సమితి నాయకులు ఆ దివారం అర్థన గ్న ప్రదర్శనతో తమ నిరసన తెలిపారు. అమ్మనబోలును వెంటనే మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీల్లో తీర్మానం, మండల సర్వసభ్య సమావేశాల్లో ఏకవాక్య తీర్మానాలు చేసినందున అమ్మనబోలును మండలంగా ప్రకటిస్తూ నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని మండల సాధన సమితి నేతలు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే చొరవ చూపాలని వారు కోరారు. 

బీజేపీ మద్దతు: అమ్మనబోలును మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన దీక్షకు బీజేపీ మండల శాఖ మద్దతు తెలిపింది. పార్టీ జిల్లా కార్యదర్శి పోతులపాటి అరుణ, మండల అధ్యక్షుడు కొర్వి శంకర్‌ దీక్షలో పాల్గొని మండలం కోసం చేసే ఆందోళనకు తమ సహకారం అందిస్తామన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.