ఆవు పేడ తినే డాక్టర్... కారణం వింటే మైండ్ బ్లాంక్...

ABN , First Publish Date - 2021-11-18T23:39:43+05:30 IST

హర్యానాలోని కర్ణాల్‌ నివాసి, చిన్న పిల్లల వైద్య

ఆవు పేడ తినే డాక్టర్... కారణం వింటే మైండ్ బ్లాంక్...

న్యూఢిల్లీ : హర్యానాలోని కర్ణాల్‌ నివాసి, చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ మనోజ్ మిట్టల్ ఆవు పేడ తింటున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆవు పేడ వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన ఈ వీడియోలో వివరించారు. ఆయన ట్విటర్ ఖాతానుబట్టి ఆయన ఎంబీబీఎస్, ఎండీ చేసినట్లు తెలుస్తోంది. 


డాక్టర్ మనోజ్ మిట్టల్ ఓ పశువుల శాల వద్ద ఈ వీడియోను చిత్రీకరించారు. ఆవు నుంచి లభించే పంచగవ్యముల ప్రాముఖ్యం గురించి ఆయన వివరించారు. తన తల్లి ఉపవాసం ఉండేటపుడు ఆవు పేడను తినేవారని చెప్తూ, ఆయన కూడా కొంచెం పేడను తిన్నారు. మనసును, ఆత్మను ప్రక్షాళన చేసే శక్తి, సామర్థ్యాలు ఆవు పేడకు ఉన్నాయని చెప్పారు. కడుపులోకి వెళ్ళిన ఆవు పేడ శరీర వ్యవస్థలోకి వ్యాపించిన తర్వాత శరీరం కూడా పరిశుభ్రం అవుతుందన్నారు. 


ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు కామెంట్ల వరద పారించారు. ఓ యూజర్ స్పందిస్తూ, ఈ సోదరుడు ఈ పని ఎంత తేలిగ్గా చేశారో, అంత తేలిగ్గా తాను రాజ్‌మా అన్నాన్ని సైతం తినలేనని అన్నారు. 


‘‘వండవలసిన అవసరం లేదు, కనీసం ఉప్పు అయినా వెయ్యనక్కర్లేదు? అద్భుతమైన ఆహారం!’’ అని మరొక ట్విటరాటీ పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-18T23:39:43+05:30 IST