సామాజిక తనిఖీపై వాడివేడి చర్చ

ABN , First Publish Date - 2021-12-04T04:32:37+05:30 IST

ఉపాధి హామీ పథకం పనుల సామాజిక తనిఖీపై శుక్రవారం మండల మీట్‌లో వాడివేడిగా చర్చ జరిగింది.

సామాజిక తనిఖీపై వాడివేడి చర్చ

ఆత్మకూరు, డిసెంబరు 3: ఉపాధి హామీ పథకం పనుల సామాజిక తనిఖీపై శుక్రవారం మండల మీట్‌లో వాడివేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సమక్షంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై జడ్పీటీసీ, సర్పంచలు, ఎంపీటీసీలు ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఆత్మకూరు మండలంలో 1.4.2019 నుంచి 31.3.2021 వరకు రూ.17.12 కోట్ల పనులు జరిగితే సామాజిక తనిఖీ బృందాలు నామమాత్రంగా విచారణ చేపట్టి రూ.78 వేలు రికవరీ చూపడంపై జడ్పీటీసీ కురుకుంద శంకరరెడ్డి మండిపడ్డారు. ఈ విషయాన్ని జిల్లా పరిషత సమావేశాల్లో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇందుకు ఎమ్మెల్యే శిల్పా స్పందిస్తూ డ్వామా పీడీకి ఫోన చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే గ్రామాల్లో విద్యుత స్థంభాలను ఏర్పాటు చేయాలని, వ్యవసాయానికి అదనపు ట్రాన్సఫార్మర్లను ఏర్పాటు చేయాలని పలువురు సభ్యులు కోరారు. అదేవిధంగా నల్లకాల్వ గ్రామంలో చెరువును ఆక్రమించి కొందరు పంటలు సాగు చేస్తున్నారని, ఆక్రమణలను తొలగించాలని సర్పంచ కోరారు. కృష్ణాపురంలో పైకా భవనాన్ని కొందరు ఆక్రమించారని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఖాళీ చేయిస్తామన్నారు. పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదించామని ఏవో విష్ణువర్ధనరెడ్డి తెలిపారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మినుము విత్తనాలను సబ్సిడీ కింద ఇస్తున్నట్లు వివరించారు. జలజీవన మిషనలో భాగంగా ఎనిమిది గ్రామాల్లో కుళాయిలు ఏర్పాటు చేశామని, మిగతా గ్రామాల్లో పనులు జరుగుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా ఓటీఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్యామలాదేవి, ఎంపీపీ తిరుపాలమ్మ, వైస్‌ ఎంపీపీ రేనాటి పద్మజ, మండల ప్రత్యేక అధికారి రాజు, తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు, ఎంపీడీవో మోహనకుమార్‌, ఎంఈవో జానకీరామ్‌, ఏపీఎం పుల్లయ్య, ఏపీవో నాగన్న, హెచవో కళ్యాణి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ విద్యాసాగర్‌, ఏఈ రమేష్‌బాబు, పంచాయతీరాజ్‌ ఏఈ వెంకటరమణ, ఐటీడీఏ స్పెషల్‌ ఆఫీసర్‌ కేజీ నాయక్‌, వైద్యాధికారి సుప్రవళ్లిక, నీలోఫర్‌ బా, రేంజర్‌ బాలసుబ్బయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-12-04T04:32:37+05:30 IST