నిర్వాహకులకు భారంగా మధ్యాహ్న భోజనం

ABN , First Publish Date - 2022-01-21T04:13:05+05:30 IST

ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనపథకం నిర్వాహకులకు భారంగా మారుతోంది. లాకడౌన్‌ అనంతరం పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో పథకం అమలు కష్ట తరమవు తోంది.

నిర్వాహకులకు భారంగా మధ్యాహ్న భోజనం
కొండపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతున్న నిర్వాహకులు

- పెరిగిన నిత్యావసర సరుకులు

- బిల్లులు రాక నిర్వహకులకు ఇక్కట్లు

- అప్పులు చేసి వండి పెడుతున్న మహిళలు

- చార్జీలు పెంచాలని వేడ్కోలు

రెబ్బెన, జనవరి 20: ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనపథకం నిర్వాహకులకు భారంగా మారుతోంది. లాకడౌన్‌ అనంతరం పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో పథకం అమలు కష్ట తరమవు తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బిల్లులు అందించకపోవడంతో అప్పుచేసి మరీ విద్యార్థుల కడుపు నింపుతున్నారు. ప్రభుత్వం కేవలం బియ్యం సరఫరా చేస్తుండగా మిగిలిన వాటి కోసం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో పథ కాన్ని కొనసాగించడం తలకు మించిన భారమవు తోంది. మధ్యాహ్న భోజనాల చార్జీలు పెంచాలని ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 

పెరిగిన గుడ్డు ధర

మెనూ ప్రకారం వారానికి మూడురోజులు విద్యార్థు లకు కోడిగుడ్లు అందించాలి. ప్రభుత్వం ఒక గుడ్డుకు రూ.4.50నిర్వాహకులకు చెల్లిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.5.75ఉండడంతో ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోవడం లేదు. దీంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు ఒకటి రెండు రోజులు మాత్రమే గుడ్డు అందిస్తున్నారు. గతంతో పోల్చితే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా భోజనాలు అందించేందుకు నిర్వాహకులు తం టాలు పడుతున్నారు. సెప్టెంబరు1 నుంచి పాఠశా లలు తెరుచుకోగా అప్పటినుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మండలంలో నిర్వాహకుల వేతనాలను కలుపుకుని ప్రతినెల సుమారు రూ.3 లక్షల వరకు బిల్లులుచెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం మూడునెలల బిల్లులు రావాల్సి ఉన్నాయి. అలాగే పెరిగిన కూరగాయల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం విద్యార్థులకు అందించే మెనూధరల్లో నయాపైసా పెంచ డం లేదు. 1నుంచి 5వతరగతి వరకు చదు వుతున్న విద్యార్థులకు రోజుకు రూ.4. 97,6 నుంచి 8వతరగతి చదివే విద్యార్థులకు రూ.7.45చొప్పున నిర్వాహకులకు అందిస్తోంది. 9,10తరగతి విద్యార్థులకు చెల్లించే మెస్‌చార్జీల్లో గుడ్డు ధరను కలిపి ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.9.45 చెల్లిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో పప్పుదినుసులతో పాటు ఏ కూర గాయలను కొందామన్నా ధరలు మండిపోతున్నాయి. దీంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు నీళ్ల చారే దిక్కవుతోంది.

చార్జీలు పెంచాలి..

- తారాబాయి, నిర్వాహకురాలు, కొండపల్లి

లాక్‌డౌన్‌కు ముందుతో పోల్చితే ఇప్పుడు నూనెలు, పప్పులు, కూరగాయలు, గుడ్లధరలు పెరిగాయి. ప్రభు త్వం అందించే బిల్లులు ఎటూ సరిపోవు. అప్పు చేసి మరీ విద్యార్థులకు భోజనాలు అందిస్తున్నాం. పెరిగిన ధరలకు అను గుణంగా చార్జీలుపెంచాలి. అప్పుడే కాస్త గిట్టుబాటు అవుతుంది.

త్వరలో బిల్లులు..

- వెంకటేశ్వరస్వామి, ఎంఈవో

మధ్యాహ్న భోజనాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు త్వరలో చెల్లిస్తాం. మార్కెట్‌లో అన్ని వస్తువుల ధరలు పెరిగినా విద్యార్థులందరికీ భోజనాలు అందేలా ఏర్పాట్లు  చేస్తున్నాం.

Updated Date - 2022-01-21T04:13:05+05:30 IST