ఏనుగుల గుంపు హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-06-24T09:08:16+05:30 IST

చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలో బుధవారం ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది. 26 ఏనుగులు ఒక్కసారిగా ఊరివైపు రావడంతో జనం బెంబేలెత్తారు. పలమనేరుకు ఆనుకొని ఉన్న పెద్దచెరువు ప్రాంతంలోకి బుధవారం ఉదయం

ఏనుగుల గుంపు హల్‌చల్‌

పలమనేరు, జూన్‌ 23: చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలో బుధవారం ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది. 26 ఏనుగులు ఒక్కసారిగా ఊరివైపు రావడంతో జనం బెంబేలెత్తారు. పలమనేరుకు ఆనుకొని ఉన్న పెద్దచెరువు ప్రాంతంలోకి బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ గుంపు ప్రవేశించింది. ఏనుగుల మంద పంటపొలాల్లో పరుగులు తీసింది. చెరువులో జలకాలాడాయి. వాటిని చూసేందుకు వందలాది మంది తరలిరావడంతో.. వారి జనం అరుపులతో బెదిరిన ఏనుగులు ఎటుపోవాలో తెలియక పరుగులు తీశాయి. ఒక పాడిఆవును తొండంతో బాది చంపేశాయి. పంటలు, పైప్‌లైన్లను ధ్వంసం చేశాయి. అటవీ సిబ్బంది రంగంలోకి దిగి బాణసంచా కాల్చుతూ ఏనుగుల గుంపును తరిమేందుకు ప్రయత్నించారు. బాణసంచా చేతిలోనే పేలడంతో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. ఎట్టకేలకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి తరిమేశారు.

Updated Date - 2021-06-24T09:08:16+05:30 IST