Karnataka : టిప్పు సుల్తాన్ ప్యాలెస్‌ స్థలంలో సర్వే చేయాలి : హిందూ జన జాగృతి

ABN , First Publish Date - 2022-05-26T20:17:10+05:30 IST

జ్ఞానవాపి, కుతుబ్ మినార్‌, మథుర వివాదాలు ఓవైపు కొనసాగుతుండగానే

Karnataka : టిప్పు సుల్తాన్ ప్యాలెస్‌ స్థలంలో సర్వే చేయాలి :  హిందూ జన జాగృతి

బెంగళూరు : జ్ఞానవాపి, కుతుబ్ మినార్‌, మథుర వివాదాలు ఓవైపు కొనసాగుతుండగానే, మరో డిమాండ్ తెరపైకి వచ్చింది.  మైసూరు రాజు టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే చేయాలని హిందూ జన జాగృతి సమితి డిమాండ్ చేసింది. 15వ శతాబ్దంనాటి కోటే వేంకట రమణ స్వామి దేవాలయం భూములను ఆక్రమించుకుని ఈ ప్యాలెస్‌ను నిర్మించారని ఆరోపించింది. 


హిందూ జన జాగృతి సమితి ప్రతినిధి మోహన్ గౌడ గురువారం మాట్లాడుతూ, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే చేయాలని కోరారు. కోటే వేంకట రమణ స్వామి దేవాలయం భూములను టిప్పు సుల్తాన్ ఆక్రమించుకుని ఈ ప్యాలెస్‌ను నిర్మించినట్లు అనేక మంది చెప్పారన్నారు. ఈ స్థలంలో అప్పట్లో వేదాలను బోధించేవారని చెప్పారు. ఈ భూమిని అసలు యజమానికి (దేవాలయానికి) బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-05-26T20:17:10+05:30 IST