బాబ్రీని కూల్చివేసి చారిత్రక తప్పిదాన్ని సరిద్దారు: ప్రకాశ్ జవదేకర్

ABN , First Publish Date - 2021-01-25T02:54:37+05:30 IST

బాబ్రీ మసీదు కూల్చివేతపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 డిసెంబరు

బాబ్రీని కూల్చివేసి చారిత్రక తప్పిదాన్ని సరిద్దారు: ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీ:  బాబ్రీ మసీదు కూల్చివేతపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 డిసెంబరు 1992న బాబ్రీ మసీదు కూల్చివేతతో చారిత్రక తప్పిదానికి తెరపడిందని అన్నారు. శ్రీ రామ జన్మభూమి మందిర్ నిధి సమర్పణ్ అభియాన్‌కు విరాళాలు ఇచ్చిన వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.6 డిసెంబరు 1992న ఓ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దారని అన్నారు. 


బాబర్ వంటి విదేశీ ఆక్రమణదారులు భారతదేశానికి వచ్చినప్పుడు, కూల్చివేత కోసం రామ మందిరాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అని ప్రశ్నించిన జవదేకర్.. ‘‘ఎందుకంటే, ఈ దేశం ఆత్మ రామాలయంలో ఉంటుందని వారికి తెలుసు’’ అని అన్నారు. డిసెంబరు 6, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో అప్పుడు జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దారని జవదేకర్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-01-25T02:54:37+05:30 IST