నెల్లూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-06-16T13:11:08+05:30 IST

జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని కోట మండలం కొత్తపట్నం నెక్కంటి కొరమండల్ కాటన్ తయారీ కర్మాగారంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.

నెల్లూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

నెల్లూరు: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని కోట మండలం కొత్తపట్నం నెక్కంటి కొరమండల్‌లోని కాటన్ తయారీ కర్మాగారంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. షర్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. భారీ అగ్నిప్రమాదం జరగడంతో మంటలు ఫ్యాక్టరీలో ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటలుగా మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరు లేకపోవడంతో  ప్రాణాపాయం తప్పింది.  ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-06-16T13:11:08+05:30 IST