పాతపాడు డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-04-10T00:55:40+05:30 IST

నగరంలోని పాతపాడు డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

పాతపాడు డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ: నగరంలోని పాతపాడు డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెత్తకు నిప్పు అంటుకొని మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో కిలోమీటర్ల మేర దట్టమైన పొగ అలుముకుంది. ఫైరింజన్‌, 10 ట్యాంకర్లతో అధికారులు మంటలార్పుతున్నారు. డంపింగ్‌ యార్డు సమీపంలో మామిడి తోటలు ఉన్నాయి. ఈ  మంటల కారణంగా మామిడి తోటల్లోని కోతకొచ్చిన మామిడికాయలు పొగచూరిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-04-10T00:55:40+05:30 IST