Saudi Arabia: ఈ హైదరాబాదీపై విధికి ఎందుకంత కోపం.. కొత్త ఉద్యోగంలో చేరాల్సిన రోజే.. దేశం కాని దేశంలో..

ABN , First Publish Date - 2022-09-14T00:08:32+05:30 IST

డబ్బులు బాగా సంపాదించి.. కన్నవాళ్లను, కట్టుకున్న భార్యను బాగా చూసుకోవాలని అతడు భావించాడు. దేశం కాని దేశంలో అడుగుపెట్టాడు. అక్కడి ఓ సంస్థలో ఉద్యోగం పొంది.. వచ్చే జీతం నుంచి నెల నెలా కొంత మొత్తాన్ని కుటుంబ సభ్యులకు పంపిస్తున్నాడు. కొంత కాలం ఇలానే గడిచిపోయింది. ఈ క్రమంలోనే ఖర్చులు పెరిగాయి. వచ్చే జీ

Saudi Arabia: ఈ హైదరాబాదీపై విధికి ఎందుకంత కోపం.. కొత్త ఉద్యోగంలో చేరాల్సిన రోజే.. దేశం కాని దేశంలో..

ఎన్నారై డెస్క్: డబ్బులు బాగా సంపాదించి.. కన్నవాళ్లను, కట్టుకున్న భార్యను బాగా చూసుకోవాలని అతడు భావించాడు. దేశం కాని దేశంలో అడుగుపెట్టాడు. అక్కడి ఓ సంస్థలో ఉద్యోగం పొంది.. వచ్చే జీతం నుంచి నెల నెలా కొంత మొత్తాన్ని కుటుంబ సభ్యులకు పంపిస్తున్నాడు. కొంత కాలం ఇలానే గడిచిపోయింది. ఈ క్రమంలోనే ఖర్చులు పెరిగాయి. వచ్చే జీతం ఖర్చులకు కూడా సరిపోకపోవడంతో.. జాబ్ మారాలనుకున్నాడు. పెద్ద మొత్తంలో జీతం వచ్చే మరో సంస్థలో ఉద్యోగం పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అతడి శ్రమ ఫలించింది. కోరుకున్న జీతానికి మరో సంస్థలో ఉద్యోగం లభించింది. ఇంతలో అతడిని విధి చిన్న చూపు చూసింది. దీంతో కొత్త ఉద్యోగంలో చేరే రోజే అతడు ప్రాణాలు వదిలాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


హైదరాబాద్‌లోని టోలీచౌకీ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజాహీద్ అలీ(37) ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ డమ్మమ్‌ నగరంలోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇంతకాలం కుటుంబాన్ని పోషించుకున్నాడు. తర్వాత ఖర్చులు పెరగడంతో ఉద్యోగం మారాలనుకున్నాడు. మంచి జీతంతో ఉద్యోగం పొందేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఈ నేపథ్యంలో ఓ సంస్థలో మంచి వేతనానిని మహ్మద్‌కు ఉద్యోగం లభించింది. ఆదివారం రోజు కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. అతడు నివసించే ఇంటి మీద ఉలుకూ పలుకు లేకుండా పడి ఉన్న మహ్మద్‌ను చూసి చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కార్డియాక్ అరెస్ట్ వల్ల అహ్మద్ మరణించినట్టు ధ్రువీకరించారు. విషయం తెలిసి, హైదరాబాద్‌లో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రియాద్‌లోని కమ్యూనిటీ వర్కర్ అబ్దుల్ జబ్బర్‌ను సంప్రదించి.. ఫార్మాలిటీలు పూర్తి చేయాల్సిందిగా కోరారు. 



ఇదిలా ఉంటే.. మారుతున్న జీవనశైలి కారణంగా అధిక రక్తపోటు, మానిసిక ఒత్తిడి యువతలో పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా హృదయ సంబంధిత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొంటున్నారు. జీవన శైలి కారణంగా వివాహం, కొత్త ఇల్లు లేదా కొత్త వ్యక్తులను కలుసుకోవటం వంటి సంతోషకరమైన క్షణాల్లో కూడా కొంత మంది యువత ఒత్తిడికి గురవుతున్నారని ప్రఖ్యాత భారతీయ వైద్యుడు డాక్టర్ గయాస్ అహ్మద్ సత్తార్ అన్నారు. నిద్రలేమి, వ్యాయామం, స్మార్ట్‌ఫోన్‌లతో ఎక్కువ సమయం గడపుతుండటం వంటి విషయాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


Updated Date - 2022-09-14T00:08:32+05:30 IST