అవగాహన సదస్సులో మట్లాడుతున్న ఎమిలి డైరెక్టర్ మోజేష్
గద్వాల అర్బన్, మార్చి 27 : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతీయువకులు ప్రణాళికాబద్ధంగా ఇష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం కష్టం కాదని ఎమిలి డైరెక్టర్ మోజేష్ అన్నారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ స్సష్టమైన లక్ష్యాలను ఎం చుకోవాలని వారికి సూచించారు. ఆదివారం నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం ఆధ్వర్యం లో జిల్లా కేంద్రంలోని నల్లకుంట వాల్మీకి భ వనంలో టెట్, టీఆర్టీ అభ్యర్థులకు అవగా హన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్‌కు చెందిన ఎమిలి డైరె క్టర్ మోజేష్ మాట్లాడుతూ ప్రభుత్వం టెట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసిందని, జూన్ 12న పరీక్ష ఉందన్నారు. సమయాన్ని సద్వినియో గం చేసుకుని, మార్కెట్లోకి వచ్చే ప్రతీ పుస్త కం చదవకుండా అకాడమీ పుస్తకాలు మాత్ర మే చదవాలన్నారు. ముఖ్యంగా అభ్యర్థులు సైకాలజీ, పెడగాజి, కంటెంట్ మీద దృష్టి సా రించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌టీఎస్‌ఎఫ్ అధ్యక్షుడు పాల్వాయి లక్ష్మీనారాయణ, కొండాపురం ప్రతాప్, ఈశ్వర్, అవనిశ్రీ వీరేష్, కర్రెప్ప, జాకీర్, బుచ్చన్న, రాజు, సాగర్, వెంకటేశ్వర్లు, బసవరాజు, కృష్ణదేవరాయలు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు.