భార్య, భర్త, నలుగురు పిల్లలున్న కుటుంబానికి అనుకోని కష్టం.. దేశంలోంచి పంపించేసిన Kuwait.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-31T18:17:01+05:30 IST

దేశం కాని దేశంలో భార్య, భర్త, నలుగురు పిల్లలున్న ఓ జోర్డానియన్ కుటుంబానికి అనుకోని కష్టం వచ్చి పడింది. కరోనా కారణంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు కోల్పోవడంతో పూట గడవడం కూడా కష్టంగా మారిపోయింది.

భార్య, భర్త, నలుగురు పిల్లలున్న కుటుంబానికి అనుకోని కష్టం.. దేశంలోంచి పంపించేసిన Kuwait.. అసలేం జరిగిందంటే..

కువైత్ సిటీ: దేశం కాని దేశంలో భార్య, భర్త, నలుగురు పిల్లలున్న ఓ జోర్డానియన్ కుటుంబానికి అనుకోని కష్టం వచ్చి పడింది. కరోనా కారణంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు కోల్పోవడంతో పూట గడవడం కూడా కష్టంగా మారిపోయింది. ఇక ఉంటున్న ఇంటి అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఖాళీ చేయించేశాడు. దాంతో ఓ చంటి బిడ్డతో సహా నలుగురు పిల్లలను తీసుకుని ఆ దంపతులు షువైక్ బీచ్ ఒడ్డుకు చేరుకున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో బీచ్‌కు వచ్చిపోయే సందర్శకులిచ్చే ఆహార పదార్థాలతో కొన్ని రోజులు గడిపారు. ఇక రాత్రిళ్లు వారికి ఉన్న కారులోనే పడుకునేవారు. అయితే, కొన్నిరోజులకు అది కూడా పాడైపోవడంతో వారికి రాత్రిళ్లు పడుకోవడం కష్టంగా మారిపోయింది. 


దాంతో బీచ్‌లోనే ఓపెన్ ఏరియాలో పడుకునేవారు. ఈ క్రమంలో ఒకరోజు తనిఖీల్లో భాగంగా అటువైపుగా వచ్చిన కువైత్ ప్రభుత్వాధికారుల దృష్టిలో పడ్డారు. దీంతో వారిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయని, ఆదాయం లేకపోవడంతో ఇంటి అద్దె చెల్లించేలేక బీచ్‌లో కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపారు. అయితే, కువైత్ విదేశీ రెసిడెన్సీ చట్టంలోని ఆర్టికల్-16 ప్రకారం ఆదాయ వనరు లేకపోతే ఆ దేశంలో ప్రవాసులు ఉండడానికి వీల్లేదు. కచ్చితంగా ఏదోఒక ఆదాయ వనరు ఉండాల్సిందే. లేనిపక్షంలో దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ నియమం ప్రకారమే తాజాగా ఆ జోర్డానియన్ ఫ్యామిలీని కూడా కువైత్ అధికారులు దేశంలోంచి పంపించివేశారు.  

Updated Date - 2022-05-31T18:17:01+05:30 IST