ఉపాధి కల్పనలో అగ్రపీఠం

ABN , First Publish Date - 2022-05-01T06:14:37+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అత్యఽధిక మంది కూలీలకు పని కల్పించిన జిల్లాగా జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది.

ఉపాధి కల్పనలో అగ్రపీఠం
కుంటాల మండలంలో ఉపాధి పనులు చేపడుతున్న కూలీలు

జిల్లాకు రాష్ట్రంలో మొదటిస్థానం 

ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో సరాసరి 200 మందికి పనికల్పన

ఉపాధి కల్పనతో పాటు శిక్షణపై దృష్టి

ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌తో పారదర్శకత

నిర్మల్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అత్యఽధిక మంది కూలీలకు పని కల్పించిన జిల్లాగా జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 15,71,004 మంది కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పని కల్పించారు. ఇందు లో నుంచి జిల్లాలో 82,466 మంది కూలీలకు పని కల్పించడం విశేషం. మొత్తం జిల్లాలో 396 గ్రామపంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీలో సరాసరి 208 మందికి ఉపాధి కల్పించి జిల్లా మిగతా జిల్లాల కన్నా ముందు వరుసలో నిలిచింది. కాగా జయశంకర్‌ భుపాలపల్లి జిల్లా తమ 241 గ్రామపంచాయతీలకు గాను ప్రతీ గ్రామ పంచాయతీలో 189 మంది కూలీలకు ఉపాధి పని కల్పించారు. కాగా మూడో స్థానంలో నిలిచిన నిజామాబాద్‌ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలకు గానూ 97,796 మంది కూలీలకు పని కల్పించినప్పటికీ ఇక్కడి సరాసరి ప్రతి గ్రామంలో 185 మందికి మాత్రమే పని కల్పించారు. దీంతో నిజామాబాద్‌ జిల్లా మూడవ స్థానానికి పరిమితమైంది. చివరిస్థానంలో నిలిచిన మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 61 గ్రామపంచాయతీలకు గానూ 960 మంది కూలీలకు మాత్రమే పని కల్పించారు. ఒక్కో గ్రామ పంచాయతీ గాను సరాసరి 16 మంది కూలీలకు మాత్రమే పని కల్పించారు. రాష్ట్రంలో మొత్తం 540 మండలాల్లో 12,769 గ్రామ పంచాయతీలుండగా ఇందులో నుంచి 12,708 గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించారు. 

ప్రతి జీపీలో సరాసరి 200 మందికి ఉపాఽధి

కాగా జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు గాను 395 గ్రామ పంచాయతీల్లో మొత్తం 82, 466 మందికి ఉపాఽధి కల్పించారు. అయితే ఒక్కో గ్రామ పంచాయతీకి గానూ 208 మందికి ఉపాధి అవకాశం కల్పించి జిల్లా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జిల్లా తరువాత జయశంకర్‌ భుపాలపల్లి, నిజామాబాద్‌ జిల్లాలు రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి. అలాగే చివరి స్థానంలో మేడ్చల్‌ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో ఒక్కో గ్రామ పంచాయతీకి గాను కేవలం 16 మందికి ఉపాఽధి అవకాశం కల్పించారు. ముఖ్యంగా జాబ్‌కార్డు కలిగిన వారందరికి కనీసస్థాయిలో పని కల్పించిన ఘనత కూడా నిర్మల్‌కు దక్కింది. ప్రకృతి వైపరీత్యాలు, ఎండ తీవ్రత అలాగే క్షేత్రస్థాయిలోని సమస్యలను అధిగమించి ఇక్కడి అధికారులు ప్రతీ గ్రామ పంచాయతీకి సరాసరికి 200 మందికి ఉపాఽధి కల్పించడం విశేషంగా పేర్కొంటున్నారు. 

ఉపాధికల్పనతో పాటు శిక్షణపై దృష్టి

ఉపాఽధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించడమే కాకుండా నైపుణ్యం ఉన్న కూలీలకు వృత్తిపరమైన శిక్షణ కూడా ఇచ్చేందుకు అధి కారులు చర్యలు చేపట్టారు. అయితే తమకున్న ఆసక్తికి అనుగుణంగా కూలీలకు వారు ఎంచుకున్న వృత్తిపనిలో శిక్షణ కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ శిక్షణ కార్యక్రమం కోసం ఉపాధి హామీ శాఖ ప్రత్యేక చర్య లు చేపట్టింది. కంప్యూటర్‌ సైన్స్‌, వైండింగ్‌, ఏసీ మెకానిక్‌, టూ వీలర్‌, త్రీ వీలర్‌ మెకానిజం, సెల్‌ఫోన్‌ మెకానిజం లాంటి రంగాల్లో శిక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. 

ఎన్‌ఐసీ సాప్ట్‌వేర్‌తో పారదర్శకత

జిల్లాలో మొత్తం 395 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులన్నీ పూర్తి పారదర్శకంగా చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్‌ఐసీ సాప్ట్‌వేర్‌ అమలవుతున్న కారణంగా ఆ సాఫ్ట్‌వేర్‌కు అనుగుణంగా ఆన్‌లైన్‌లో ఉపాధి హామీ పనుల వివరాలతో పాటు కూలీ పనులు చేసిన వారి వివరాలన్నీ నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రతీరోజూ రెండుసార్లు తాము పని చేసే చోటు నుంచే ఆన్‌లైన్‌లో ప్రతీకూలీ తన హాజరును అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకయాప్‌ను కూడా రూపొందించారు. ఈ ప్రక్రియ కారణంగా క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనుల వివరాలు, కూ లీల సంఖ్య, ఇతర వివరాలన్నీ ఎప్పటికప్పుడు సంబంధిత ఉన్నతాధికారులకు చేరుతున్నాయి. దీంతో హైదరాబాద్‌ స్థాయి నుంచే ఉపాఽధి హామీ పనులపై పర్యవేక్షణ కొనసాగుతోంది. 

సమష్టి కృషితోనే మొదటిస్థానం

ఉపాధికూలీలతో పాటు సంబంధిత అఽధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయడంతోనే జిల్లాకు రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం దక్కింది. అధికారులు, కూలీలు సమన్వయంగా వ్యవహరించడంతోనే ఈ ఫలితం దక్కింది. జిల్లాలోని ప్రతీ గ్రామపంచాయతీలో సరాసరిగా 200 మంది కూలీలకు ఉ పాధి కల్పించాం. కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు వారికి ఇబ్బం దులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. 

విజయలక్ష్మి, పీడీ డీఆర్‌డీఏ

Updated Date - 2022-05-01T06:14:37+05:30 IST