పురాణ సమదర్శనం

ABN , First Publish Date - 2022-09-16T05:30:00+05:30 IST

‘పురాభవమ్‌ ఇతి పురాణమ్‌’ అనేది నానుడి. గతంలో జరిగిన విషయాలను నవీకృతంగా మనకు పురాణాలు అందిస్తాయి. ఈ పురాణాలు వేదాలకు వ్యాఖ్యానాలు. మహాభారతంలో ‘ఇతిహాస పురాణాభ్యాం వేదాన్‌ సుముపబృంహయేత్‌’

పురాణ సమదర్శనం

 ‘పురాభవమ్‌ ఇతి పురాణమ్‌’ అనేది నానుడి. గతంలో జరిగిన విషయాలను నవీకృతంగా మనకు పురాణాలు అందిస్తాయి. ఈ పురాణాలు వేదాలకు వ్యాఖ్యానాలు. మహాభారతంలో ‘ఇతిహాస పురాణాభ్యాం వేదాన్‌ సుముపబృంహయేత్‌’ అని పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలన్నీ ఒకప్పుడు ఒకటిగానే ఉండేవిట. కాలాంతరం వేదవ్యాసుడు వీటిని 18 పురాణాలుగా విభజించాడని చెబుతారు. ఈ పురాణాల తత్త్వం ఆధారంగా వీటిని మూడు వర్గాలుగా విభజించారు. విష్ణుపురాణం, నారదీయం, భాగవతం, గరుడపురాణం, పద్మపురాణం, వరాహపురాణాలను సాత్వ్తిక పురాణాలంటారు. బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, మార్కండేయ, భవిష్య, వామన, బ్రహ్మపురాణాలను రాజస పురాణాలుగాను... మత్స్య, కూర్మ, లింగ, శైవ, స్కాంద, అగ్ని పురాణాలను తామస పురాణాలుగా పేర్కొంటారు. ఇలాంటి పురాణాల విశేషాలను మనకు అందించేదే డాక్టర్‌ జయంతి చక్రవర్తి రచించిన ‘పురాణ దర్శనం’. సనాతన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్నవారు తప్పకుండా చదవాల్సిన పుస్తకాలివి. 


పురాణ దర్శనం (మూడు సంపుటాలు)

రచన: డాక్టర్‌ జయంతి చక్రవర్తి

ప్రచురణ: శ్రీ పావని సేవాసమితి

ప్రతులకు: 9908616366

Updated Date - 2022-09-16T05:30:00+05:30 IST