Madhya Pradesh: విద్యుదాఘాతంతో చిరుతపులిని చంపిన వేటగాళ్లు... ఇద్దరి అరెస్ట్...

ABN , First Publish Date - 2022-08-06T20:14:08+05:30 IST

మధ్య ప్రదేశ్‌ (Madhya Pradesh)లో వేటగాళ్ళు అత్యంత దారుణాలకు

Madhya Pradesh: విద్యుదాఘాతంతో చిరుతపులిని చంపిన వేటగాళ్లు... ఇద్దరి అరెస్ట్...

భోపాల్ : మధ్య ప్రదేశ్‌ (Madhya Pradesh)లో వేటగాళ్ళు అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు. విద్యుత్ షాక్ తగిలేవిధంగా చేసి ఓ చిరుతపులి (leopard)ని చంపేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర జంతువుల కోసం వేసిన ఈ వలలో ఈ చిరుతపులి పడినట్లు అనుమానిస్తున్నారు. 


డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (నార్త్) గౌరవ్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, బియోహరి అడవిలో ఖర్పా బీట్ వద్ద తుప్పల్లో మరణించిన ఓ చిరుతపులి కనిపించిందని చెప్పారు. సంజయ్ పులుల అభయారణ్యం (Sanjay Tiger Reserve) నుంచి జాగిలాలను రప్పించి ఆధారాల సేకరణ కోసం ప్రయత్నించామన్నారు. వేటగాళ్ళు విద్యుత్తు తీగెలతో ఏర్పాటు చేసిన వలలో పడి ఈ చిరుతపులి మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. వేటగాళ్లు ఈ వలను ఇతర జంతువుల కోసం ఏర్పాటు చేసి ఉంటారన్నారు. ఈ చిరుతపులి మృతదేహాన్ని వేటగాళ్ళు సమీపంలోని తుప్పల్లో పడేశారన్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 


Updated Date - 2022-08-06T20:14:08+05:30 IST