ఓ మహిళ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్.. దుస్తుల్లో డాక్టర్‌కు ఓ లేఖ కనిపించడంతో..

ABN , First Publish Date - 2022-09-16T21:20:43+05:30 IST

ఆమెకు వివాహమై 11ఏళ్లు అయింది. భర్త, అత్తమామలతో ఇంత వరకూ ఎలాంటి సమస్యలూ లేవు. కూతురు సంసారం ఎలా ఉంటుందో అని మొదట కంగారుపడ్డ తల్లిదండ్రులు.. తర్వాత..

ఓ మహిళ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్.. దుస్తుల్లో డాక్టర్‌కు ఓ లేఖ కనిపించడంతో..
ప్రతీకాత్మక చిత్రం

ఆమెకు వివాహమై 11ఏళ్లు అయింది. భర్త, అత్తమామలతో ఇంత వరకూ ఎలాంటి సమస్యలూ లేవు. కూతురు సంసారం ఎలా ఉంటుందో అని మొదట కంగారుపడ్డ తల్లిదండ్రులు.. తర్వాత నిర్భయంగా ఉన్నారు. తమ కూతురుకు ఎలాంటి సమస్యలూ లేవని సంతోషంగా ఉండేవారు. ఈ సమయంలో ఓ రోజు ఉన్నట్టుండి తమ కూతురు ఆరోగ్యం క్షీణించిందని ఫోన్ వచ్చింది. కొన్ని గంటల్లో ఊహించని విధంగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే మహిళ మృతదేహానికి పోస్టుమార్టం (Postmortem) చేస్తుండగా.. దుస్తుల్లో ఓ లేఖ కనిపించింది. దీంతో ఆమె మృతిపై పలు సందేహాలు (Many doubts) వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


హర్యానా (Haryana) అంబాలా జిల్లా పంచకుల గ్రామానికి చెందిన రాజ్‌వింద్ర కౌర్ అనే యువతికి.. మహేష్ నగర్‌లో ఉంటున్న రాజేష్ కుమార్‌తో 11ఏళ్ల క్రితం వివాహమైంది. ఇన్నేళ్లుగా రాజ్‌వింద్ర కౌర్‌కు ఎలాంటి సమస్యలూ లేవు. కూతురు సంక్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.. అని అనుకుంటున్న తరుణంలో బుధవారం ఉదయం అల్లుడు ఇంటి నుంచి రాజ్‌వింద్ర తండ్రి రాంపాల్‌కు ఫోన్ వచ్చింది. ‘‘మీ కూతురు ఆరోగ్యం బాలేదు.. త్వరగా రండి’’.. అని చెప్పారు. దీంతో రాజ్‌వింద్ర తమ్ముడు కంగారుగా అక్కడికి వెళ్లాడు. అప్పటికే స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్‌వింద్ర పరిస్థితి విషమించింది. సుమారు 3గంటల పాటు చికిత్స చేసిన అంనంతరం ఆమెను చండీగఢ్‌కు రెఫర్ చేశారు. అయితే అక్కడ చేర్చిన పది నిముషాల్లో రాజ్‌వింద్ర మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేస్తున్న దుస్తుల్లో ఓ లేఖ కనిపించింది.

తల ఒకచోట.. మొండెం మరో చోట.. ఒకే ఒక్క అనుమానం.. ఈ 55 ఏళ్ల వ్యక్తి మరణానికి కారణమయింది.. అసలేం జరిగిందంటే..!


రాజ్‌వింద్ర మృతికి సంబంధించిన కారణాలు (Causes of death) అందులో రాసి ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే అందులో ఏం రాసిందనే విషయం మాత్రం వారు వెల్లడించలేదు. ఆ లేఖ ఆధారంగా రాజ్‌వింద్ర కౌర్ భర్త, అత్తమామలతో సహా 11మందిపై.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. తన కుమార్తె వివాహం అయినప్పటి నుంచి తనకు ఎలాంటి సమస్యలూ తెలియజేయలేదని మృతురాలి తండ్రి రాంపాల్ తెలిపారు. మరోవైపు రాజ్‌వింద్ర అత్తమామలు మాట్లాడుతూ.. తమ కోడలు మంగళవారం రాత్రి చౌమీన్ తినిందని.. దాని కారణంగా బుధవారం ఉదయం ఫుడ్ పాయిజనింగ్ (Food poisoning) అయిందని చెబుతున్నారు. విసేరా రిపోర్టు (Viscera report) నివేదిక కోసం వేచి చూస్తున్నామని, దాని ఆధారంగా రాజ్‌వింద్ర మృతికి ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

పిల్లలను స్కూలుకు పంపించి వచ్చే లోపే.. భార్యను ప్రియుడే చంపేశాడంటూ ఏడుస్తూ చెప్పిన భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!



Updated Date - 2022-09-16T21:20:43+05:30 IST