Viral News: 441ని 4తో భాగిస్తే.. భాగఫలం ఎంత? దీనికి ఈ ప్రభుత్వ టీచర్ జవాబు చెప్పలేకపోయింది

ABN , First Publish Date - 2022-08-28T19:01:09+05:30 IST

ఆమె ఉన్నత చదువులు చదివింది.. ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం చిన్న పిల్లలు చదివే పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. కానీ ఆమెకు మాత్రం.. ప్రాథమిక అంశాలు కూడా సరిగ్గా తె

Viral News: 441ని 4తో భాగిస్తే.. భాగఫలం ఎంత? దీనికి ఈ ప్రభుత్వ టీచర్ జవాబు చెప్పలేకపోయింది

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఉన్నత చదువులు చదివింది.. ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం చిన్న పిల్లలు చదివే పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలి(School headmistress)గా విధులు నిర్వర్తిస్తోంది. కానీ ఆమెకు మాత్రం.. ప్రాథమిక అంశాలు కూడా సరిగ్గా తెలియవు. చిన్న మ్యాథ్స్ ప్రాబ్లమ్‌ను పరిష్కరించలేకపోయింది. 441ని 4తో భాగిస్తే.. భాగఫలం ఎంత అని అడిగితే.. తెల్లముఖం వేసుకుంది. దీంతో ఆమె వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 



ప్రాథమిక తరగతి చదువుతున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయులకు.. అన్ని సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉండాల్సిన అవసరం లేదు. కానీ అన్ని సబ్జెక్టుల్లోని ప్రాథమిక అంశాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది. మధ్యప్రదేశ్‌(Madhya pradesh)కు చెందిన ఓ టీచర్.. చిన్న లెక్కను కూడా పరిష్కరించలేకపోయింది. అందువల్లే ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది. పాఠశాలలను జిల్లా కలెక్టర్లు తనిఖీ చేయడం సాధరణమే. ఈ క్రమంలోని బాలాఘాట్‌ జిల్లా కలెక్టర్ గిరీష్ కుమార్ మిశ్రా.. తాజాగా ఓ పాఠశాలను సందర్శించారు. ఓ తరగతిలోకి వెళ్లి.. అక్కడున్న విద్యార్థులకు చిన్న చిన్న లెక్కలు ఇచ్చి పరిష్కరించాల్సిందిగా కోరారు. విద్యార్థులు ఎవ్వరూ ఆ లెక్కలను చేయలేకపోయారు. దీంతో ఆయన.. తరగతి ఉపాధ్యాయురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన సోనా దుర్వే‌ను.. మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇచ్చారు. 441ని 4తో భాగిస్తే.. భాగఫలం ఎంతో చెప్పాలని కోరారు. ఈ నేపథ్యంలో సదరు ఉపాధ్యాయురాలు ఆ లెక్కను పరిష్కరించలేకపోయింది( fails to solve math problem). దీంతో కలెక్టర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండాను ఆమెను ప్రధానోపాధ్యాయురాలి పదవి నుంచి తొలగించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన హాట్‌ టాపిక్‌గా మారింది. 


Updated Date - 2022-08-28T19:01:09+05:30 IST