
ఇంటర్నెట్ డెస్క్: అవును ఇది నిజంగా షాకింగ్ న్యూసే. నెలకు లక్షల్లో electricity bill వచ్చిందనే వార్తలు ఇప్పటి వరకు చాలానే విని ఉంటాం. కానీ కేవలం 24 గంటలకే రూ.39లక్షల కరెంట్ బిల్లు రావడం అంటే మాటలు కాదు. అందుకే ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇళ్లలో ఫ్రిడ్జ్, ఏసీ, టీవీలు వంటి ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉపయోగించడం సహజమే. ఈ గృహోపకరణాలను ఎంతగా భారీగా ఉపయోగించినా.. ఓ ఫ్యాక్టరీకి వచ్చిన స్థాయిలో మాత్రం కరెంట్ బిల్లు రాదు. అదీ కేవలం ఒక్కరోజుకు. కానీ ఓ వ్యక్తి విషయంలో ఇది జరిగింది. ఒక్క రోజుకు సంబంధించిన electricity billను చూసుకుని అతడి మైండ్ బ్లాంక్ అయింది. యూకేలోని స్కన్‌తోర్ప్ టౌన్‌లో నివాసం ఉంటున్న పాల్ డేవీస్ అనే వ్యక్తి తాజాగా ఒక్క రోజు కరెంట్ చార్జీగా £ 40,000(సుమారు రూ.39లక్షలు) బిల్లు రావడంతో విస్తుపోయాడు. వెంటనే పవర్ సప్లై అధికారులను సంప్రదించి.. తనకు వచ్చిన బిల్లు గురించి చెప్పాడు.
అంతేకాకుండా విద్యుత్ మీటర్‌లో సమస్య ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. అందువల్లే ఇంత మొత్తంలో బిల్లు వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. కానీ అధికారులు అతడి వాదనను ఖండించారు. మీటర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడానికి అవకాశం ఉండదని బలంగా వాదించారు. అయితే పాల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు వచ్చిన బిల్లుపై పోరాటం చేశాడు. చివరకు అధికారులు కాస్త తగ్గి, పాల్ కోణంలో ఆలోచించారు. అతడి వాదనలో నిజాయితీ ఉందని భావించి.. విద్యుత్ మీటర్‌ను చెక్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. విద్యుత్ మీటర్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే బిల్లు అలా వచ్చిందని అధికారులు అంగీకరించారు. దీంతో పాల్ ఊపిరిపీల్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి