విపరీతంగా జుట్టు రాలుతుందని.. 6ఏళ్లుగా అతడు అది చేయడమే మానేశాడు.. ఫలితంగా ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-10T20:30:55+05:30 IST

జుట్టు విపరీతంగా రాలిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. పౌష్టిక ఆహార లోపం వల్ల కొందరికి జుట్టు రాలితే.. మరికొందరికి వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఈ రెండు కారణాలను పక్క

విపరీతంగా జుట్టు రాలుతుందని.. 6ఏళ్లుగా అతడు అది చేయడమే మానేశాడు.. ఫలితంగా ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: జుట్టు విపరీతంగా రాలిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. పౌష్టిక ఆహార లోపం వల్ల కొందరికి జుట్టు రాలితే.. మరికొందరికి వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఈ రెండు కారణాలను పక్కన పెడితే.. ప్రస్తుత సమాజంలో జుట్టు రాలడం అనేది కామన్ అయిపోయింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రస్తుతం అత్యధిక మంది ప్రజలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇదంతా చెప్పడానికి ఓ పెద్ద కారణమే ఉంది. విపరీతంగా జుట్టు రాలుతుందని భావించిన ఓ వ్యక్తి ఆరేళ్ల క్రితం షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తాను పొందిన ఫలితాన్ని వెల్లడించాడు. అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



నిక్ కోయెట్జీ అనే వ్యక్తికి జుట్టు రాలడం ఓ పెద్ద సమస్యగా మారింది. ఎంతలా అంటే.. వెంట్రుకలు రాలి చొక్కాపై పడుతున్నాయని.. కాలేజీకి వెళ్లేపుడు అతడు రెండు చొక్కాలను తీసుకెళ్లేవాడు. ఒక సెషన్ ముగియగానే చొక్కాను మార్చుకునేవాడు. ఈ క్రమంలో ప్రతిరోజు షాంపూ, కండిషనింగ్ చేయడం వల్ల అందులోని కెమికల్స్ జుట్టును బలహీన పరుస్తున్నాయనే అభిప్రాయానికి వచ్చాడు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. జుట్టును వాష్ చేయడమే మానేశాడు. ఇలా ఆరేళ్లు గడిచిపోయాయి. తాజాగా అతడు తాను పొందిన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం తన జుట్టు స్ట్రాంగ్‌గా మారిందని పేర్కొన్నాడు. వెంట్రులు రాలే సమస్య నుంచి తాను బయటపడినట్టు వెల్లడించాడు. ఆరేళ్లుగా జుట్టును వాష్ చేయనప్పటికీ శరీరంలోని రసాయనాలే తన వెంట్రుకలను క్లీన్ చేసినట్టు వివరించాడు. దీంతో ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. 




Updated Date - 2022-04-10T20:30:55+05:30 IST