పెరిగిన ధరలతో చిర్రెత్తుకొచ్చిందేమో.. పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి ఇతడు చేస్తున్న నిర్వాకమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-09T22:33:36+05:30 IST

చమురు ధరలు రోజు రోజుకు భరించలేనంతగా పెరిగిపోతున్నాయి. దీంతో నిత్యవసర సరుకులు కూడా భారీ మొత్తంలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. పెరుగుతున్న

పెరిగిన ధరలతో చిర్రెత్తుకొచ్చిందేమో.. పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి ఇతడు చేస్తున్న నిర్వాకమేంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: చమురు ధరలు రోజు రోజుకు భరించలేనంతగా పెరిగిపోతున్నాయి. దీంతో నిత్యవసర సరుకులు కూడా భారీ మొత్తంలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. పెరుగుతున్న ధరలతో ఓ యువకుడికి చిర్రెత్తుకొచ్చింది. పెట్రోలు బంకుల వద్దకు కారేసుకుని వెళ్లి.. అక్కడి సిబ్బందికి షాకిస్తున్నాడు. దీంతో అతడు బంకు యజమానులకు తలనొప్పిగా మారిపోయాడు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇంతకూ విషయం ఏంటంటే..



చత్తీస్‌గఢ్‌లోని Durg and Bhilai ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొద్ది రోజులుగా స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకు యజమానులకు చమటలు పట్టిస్తున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక బంకులోకి కారేసుకుని వెళ్లి.. ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నాడు. అనంతరం డబ్బులు ఇవ్వకుండానే అక్కడ నుంచి జంప్ అవుతున్నాడు. దీంతో యజమానులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే బైక్ నెంబర్ ప్లేట్‌ను కారుకు తగిలించడం వల్ల పోలీసులు అతడిని పట్టుకోలేకపోతున్నారు. దీంతో స్థానిక పెట్రోల్ పంప్ డీలర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అతడి వ్యవహారాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ యువకుడి కోసం అధికారులు వేట ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా యువకుడిని పట్టుకునే పనిలో పడ్డారు. కాగా.. సదరు యువకుడి వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. 


Read more