Advertisement

కాటారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

Feb 22 2021 @ 00:00AM
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌


 కాటారం, ఫిబ్రవరి 22 : తనకు చెందిన  భూములను ఇతరులకు రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారంటూ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి సోమవారం  ఆత్మహత్యాయత్నం చేశాడు. కాటారం మండలంలోని గారెపల్లికి చెందిన కొట్టె శ్రీనివాస్‌ పురుగుల మందు తాగగా అతడిని ఆస్పత్రికి తరలించారు. గారెపల్లి శివారులో తాను కొనుగోలు చేసి దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమి సర్వే నెంబర్లు మారాయని కొందరు కొందరు వివాదం లేపగా అది కోర్టులో పెండింగ్‌లో ఉందని శ్రీనివాస్‌ తెలిపాడు. ఈ విషయాన్ని అధికారులకు తెలిపినప్పటికీ పాస్‌పుస్తకాలు లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని ఆరోపించాడు. దీనిపై డిప్యూటీ తహసీల్దార్‌ రామ్మోహన్‌ను వివరణ కోరగా ధరణిలో నమోదైన ఉన్న  వ్యవసాయ భూమికి సంబంధించి ఎవరు స్లాట్‌ బుక్‌ చేసుకున్నా రిజిస్ర్టేషన్లు జరుగుతాయన్నారు. భూములపై ఏవైనా వివాదాలు ఉంటే న్యాయపరంగా పరిష్కరించుకోవాలని అన్నారు.

Follow Us on:
Advertisement