ఉద్యోగరీత్యా సిటీలో భర్త.. అతడి భార్యతో ఫోన్లో అసభ్యకరంగా ఓ స్నేహితుడు చాటింగ్.. చివరకు..

ABN , First Publish Date - 2021-12-04T23:16:14+05:30 IST

తమిళనాడులో ఇధ్దరు స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. స్నేహితుడే కదా అని రోజూ ఇంటికి తీసుకెళ్తే.. చివరకు స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు. రోజూ ఫోన్‌లో అసభ్యకరంగా...

ఉద్యోగరీత్యా సిటీలో భర్త.. అతడి భార్యతో ఫోన్లో అసభ్యకరంగా ఓ స్నేహితుడు చాటింగ్.. చివరకు..
మృతుడు దినేశ్వరన్

ఎవరి మధ్య దాపరికాలు ఉన్నా.. స్నేహితుల మధ్యలో ఎలాంటి దాపరికాలూ ఉండవు. బాధను గానీ, సంతోషాన్ని గానీ మొదట స్నేహితుడితోనే పంచుకుంటారు. అయితే స్నేహానికి ఉన్న అంతటి విలువ కాస్త.. కొందరి విషయంలో ప్రస్తుతం అవసరం కోసమే స్నేహం అన్నట్లుగా మారింది. నేటి సమాజంలో చాలా మంది డబ్బు అవసరాల కోసమో, ఏవైనా పనులు చేయించుకోవడం కోసమో స్నేహం చేయడం సాధారణమైంది. తమిళనాడులో ఇధ్దరు స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. స్నేహితుడే కదా అని రోజూ ఇంటికి తీసుకెళ్తే.. చివరకు స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు. రోజూ ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడడం చేస్తుండేవాడు. ఆ చాటింగ్ చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..


తమిళనాడు నమక్కల్ జిల్లా కుమరపాలయం ప్రాంతానికి చెందిన వెంకటేష్.. తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. కంపెనీకి సమీపంలో ఉంటూ వారానికి ఒకసారి ఇంటికి వెళ్లి భార్యను చూసి వస్తుండేవాడు. వారాంతంలో రోజంతా భార్యతోనే ఉంటూ మరుసటి రోజు యథావిధిగా విధులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో కంపెనీకి సమీపంలో దినేశ్వరన్ అనే వ్యక్తితో వెంకటేష్‌కు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరి వ్యక్తిగత విషయాలు.. ఒకరు చెప్పుకోనేంత అభిమానం ఉండేది. ఇలా ఓ రోజు వెంకటేష్‌ ఇంటికి వెళ్లే సమయంలో దినేశ్వరన్‌ను కూడా తీసుకెళ్లి, భార్యకు పరిచయం చేశాడు.


భర్త స్నేహితుడే కాబట్టి ఆమె కూడా చనువుగా ఉండేది. ఈ క్రమంలో ఆమె నంబర్ తీసుకుని.. వెంకటేష్‌కు తెలీకుండా రోజూ ఫోన్లలో మాట్లాడుతుండేవాడు. వెంకటేష్ భార్య కూడా దినేశ్వరన్‌ను నమ్మి.. భర్తకు తెలీకుండా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. రోజురోజుకూ వారి మధ్య మాటలు.. నిముషాల నుంచి గంటల వరకూ వెళ్లేవి. ఈ క్రమంలో ఆమెతో శారీరక సంబంధాల గురించి, అశ్లీలంగా మాట్లాడేవాడు. ఇలా సాగుతున్న క్రమంలో ఓ రోజు వెంకటేష్‌కు విషయం తెలిసింది. ఏంటిది.. అంటూ భార్యను గట్టిగా మందలించాడు. అప్పటినుంచి దినేశ్వన్‌తో ఆమె మాట్లాడటం మానేసింది. అయితే దినేశ్వరన్ మాత్రం రోజూ మాట్లాడమని వేధించేవాడు. అతడి పోరు తట్టుకోలేక.. ఓ రోజు భర్తకు విషయం తెలియజేసింది.


స్నేహితుడని నమ్మినందుకు, తన భార్య పైనే కన్నేయండం.. వెంకటేష్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. పైకి అనుమానం రానట్టు నటించేవాడు. నవంబర్ 14న ఇంటికి వెళ్దామంటూ.. దినేశ్వరన్‌ను తీసుకెళ్లాడు. అయితే ఇంటికి కాకుండా సమీంపంలోని పెద్ద కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మాట్లాడే క్రమంలో ఒక్కసారిగా దినేశ్వరన్‌ను కాలువలోకి తోసేయండంతో ఊపిరాడక చనిపోయాడు. దినేశ్వరన్ కుటుంబ సభ్యుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. దీంతో వెంకటేష్‌తో పాటూ అతడికి సహకరించిన ఇంకో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Updated Date - 2021-12-04T23:16:14+05:30 IST