ఎయిర్‌పోర్టులో లగేజీ మిస్సింగ్..కొత్తగా పెళ్లైన జంటకు ముప్పతిప్పులు..చివరకు!

ABN , First Publish Date - 2022-04-25T00:45:06+05:30 IST

విమాన ప్రయాణంలో లగేజీ మిస్సైతే చుక్కలు కనిపిస్తాయి. పోయిన బ్యాగులు మళ్లీ మన చెంత చేరే వరకూ కంటి మీద కునుకు ఉండదు. మరి.. ప్రయాణికుల బ్యాగులు వారికి కచ్చితంగా అందించాల్సిన బాధ్యత ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థే చేతులెత్తేస్తే..? ఫోన్ చేసినా స్పందించకపోతే..?

ఎయిర్‌పోర్టులో లగేజీ మిస్సింగ్..కొత్తగా పెళ్లైన జంటకు ముప్పతిప్పులు..చివరకు!

ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణంలో లగేజీ మిస్సైతే చుక్కలు కనిపిస్తాయి. పోయిన బ్యాగులు మళ్లీ మన చెంత చేరే వరకూ కంటి మీద కునుకు ఉండదు. మరి.. ప్రయాణికుల బ్యాగులు వారికి కచ్చితంగా అందించాల్సిన బాధ్యత ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థే చేతులెత్తేస్తే..? ఫోన్ చేసినా స్పందించకపోతే..?  నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే..? ఊహించుకుంటేనే భయం గొలిపే ఈ పరిస్థితిని ఓ యువ జంట ఇటీవలే ఎదుర్కొంది. కొత్త పెళ్లయిన ఆ జంట తమ లగేజీ పోగొట్టుకుని తెగ ఇబ్బంది పడిపోయింది. వాళ్ల పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డులు, ఇతర బహుమతులన్నీ ఆ బ్యాగులోనే ఉండిపోవడంతో వారు గాబరా పడిపోయారు. అయితే.. లగేజీ విషయంలో వాళ్లు  ముందు జాగ్రత్తగా చేసిన ఓ పని కారణంగా ఈ కథకు చివరకు సుఖాంతమైంది. నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతునున్న ఈ కథనం తాలూకు పూర్తి వివరాల్లోకి వెళితే.. 


లండన్‌కు చెందిన ఎలియట్ షరోడ్, హెలెన్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. కరోనా కారణంగా 2020 నుంచి వాయిదా పడుతూ వస్తున్న వారి వివాహం దక్షిణాఫ్రికా ఏప్రిల్ 17న జరిగింది. వివాహం తరువాత.. బంధువులు, స్నేహితులు ఇచ్చిన బహుమతులు ఇతర వస్తువులు తీసుకున్న వారు తిరుగుప్రయాణమయ్యారు. కరోనా ఆంక్షల కారణంగా నేరుగా కాకుండా పలు దేశాల మీదుగా  వారు లండన్‌కు చేరుకున్నారు. జోహాన్నెస్ బర్గ్ నుంచి బయలుదేరిన వారు.. తొలుత అబుదాబికి వెళ్లి అక్కడి నుంచి ఫ్రాంక్‌ఫర్ట్, డబ్లిన్ మీదుగా లండన్‌కు చేరుకున్నారు. డబ్లన్ వరకూ వారి లగేజీ వారి వెంటే వచ్చింది. లగేజీలో పెట్టిన ఎయిర్‌ట్యాగ్స్ కారణంగా వారు తమ లగేజీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయగలిగారు.


 ఫ్రాంక్‌ఫర్ట్ వరకూ లగేజీ అనుకున్నట్టుగా చేరినా.. ఆ తరువాత విషయం మొత్తం తలకిందులైపోయింది. ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టులో వారి లగేజీని సిబ్బంది విమానంలో పెట్టనేలేదని ఎయిర్ ట్యాగ్స్ సాయంతో ఎలియట్ గుర్తించారు. విమానాశ్రయం గేటు ఏరియా వద్దే అవి ఉండిపోవడంతో ఆయన ఈ అంచనాకు వచ్చారు. ఈ విషయాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థకు ఫిర్యాదు చేయగా.. లగేజీని ఇంటి వద్దకే డోర్  ఎయిర్‌లైన్స్ వారు హామీ ఇవ్వడంతో వ ఎలియట్, ఆయన భార్య ఊపిరి పీల్చుకున్నారు. వారు అనుకున్నట్టుగానే.. ఆ జంట లండన్ చేరుకున్న మరుసటి రోజే కొరియర్‌లో వారి లగేజీ డెలివరీ అయ్యింది. 


కానీ.. మొత్తం మూడు బ్యాగులు రావాల్సి ఉండగా.. కంపెనీ వాళ్లు కేవలం రెండు బ్యాగులనే పంపించారు. ఇక అక్కడి నుంచి వాళ్లకు బ్యాడ్ టైం స్టార్టయ్యింది. మూడో బ్యాగు ఏమైందని @Aerlingus ఎయిర్‌లైన్స్ సంస్థను ఎన్ని సార్లు ప్రశ్నించినా సమాధానం రాలేదు. వాళ్ల నుంచి స్పందన లేకపోవడంతో విసిగిపోయిన ఎలియట్ చివరకు ట్విటర్‌ను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తేనే వారు దిగొస్తారని భావించి.. తన లగేజీకి సంబంధించి లొకేషన్స్ చూపిస్తూ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తయార చేసి ఎయిర్‌లైన్స్ సంస్థ తీరును ఎండగట్టారు. ఇక ఎప్రిల్ 21న అంటే.. బ్యాగు కనిపించకుండా పోయిన నాలుగు రోజుల తరువాత..  లండన్‌లోని పిమ్‌లికో అనే ప్రాంతంలో ఉన్నట్టు తెలిపారు.ఆ తరువాత. అది మరి రెండు చోట్లకు డెలివరీ అయినట్టు కూడా గుర్తించారు.  దీంతో..ఈలోపు పోలీసులకు కూడా సంప్రదించాడు. ఇలా పట్టువదలకుండా..ప్రయత్నించి చివరికి తన లగేజీని సొంతం చేసుకున్నాడు ఎలియట్. అయితే.. ఎయిర్‌ట్యాగ్ వల్లే ఎలియట్ తన లగేజీపై నిరంతరం ఓ కన్నేసి ఉంచగలగడంతో ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-04-25T00:45:06+05:30 IST