viral video: అవసరాల్లోంచే అద్భుతాలు.. నెట్టింట వైరల్ అవుతున్న సాధువు వీడియో!
ABN , First Publish Date - 2022-09-22T22:08:51+05:30 IST
మన చుట్టూ ఉన్న పరిస్థితులు, అవసరాలు.. కొత్త ఆలోచనలవైపు మనల్ని నడిపిస్తాయి. అద్భుతాలు సృష్టించేలా చేస్తాయి. పాత మాటలే అయినా.. ఇవి మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. అందుకు ఒక సాధువు కారణం అ
ఇంటర్నెట్ డెస్క్: మన చుట్టూ ఉన్న పరిస్థితులు, అవసరాలు.. కొత్త ఆలోచనలవైపు మనల్ని నడిపిస్తాయి. అద్భుతాలు సృష్టించేలా చేస్తాయి. పాత మాటలే అయినా.. ఇవి మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. అందుకు ఒక సాధువు కారణం అయ్యారు. ఆయన చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకూ విషయం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి.
కషాయ దుస్తులు ధరించి.. ఉత్తరప్రదేశ్(Uttar pradesh)లోని వీధుల వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఓ సాధువు(sadhu)ను చూసి స్థానికులు షాకవుతున్నారు. అతడు తన తలపాగాపై ఫ్యాక్టరీలలో ఉపయోగించే హెల్మెట్‌ను ధరించి.. దానికి ఓ సోలార్ ప్యానెల్, ఫ్యాన్‌ను బిగించి ఉండటాన్ని చూసి నోరెళ్ల బెడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు అతడి వద్దకు వెళ్లి విషయాన్ని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సోలార్ ప్యానల్, ఫ్యాన్‌తో కూడిన హెల్మెట్‌ను తానే తయారు చేసుకున్నట్టు పేర్కొన్నాడు. వీధుల్లో నడిచే సమయంలో ఎండ వేడికి తాలలేక ఈ వినూత్న ఆలోచన చేసినట్టు పేర్కొన్నాడు.
సోలార్ ప్యానల్ వల్ల ఫ్యాన్ నిరంతరం తిరుగుతూనే ఉంటుందని చెప్పాడు. చల్లని గాలి తన ముఖాన్ని తాకడంతో.. ఎండల వేడి ప్రభావం అంతగా కనిపించదన్నాడు. కాగా.. సాధువు చెప్పిన మాటలు విని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన వీడియో(video)ను నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్తా వైరల్(viral)గా మారింది. ఈ నేపథ్యంలోనే స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.