Viral Video: రోజూ స్కూలుకొచ్చి.. బుద్ధిగా పాఠాలు వింటున్న కొండముచ్చు!

ABN , First Publish Date - 2022-09-16T19:20:08+05:30 IST

ల్లలే బుద్ధిగా స్కూల్‌కు వెళ్లరు. కానీ అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే కొండముచ్చు మాత్రం ఎంతో క్రమశిక్షణతో ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్తోంది. అంతేకాదూ.. తరగతి గదుల్లో కూర్చుని.. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా ఆలకిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన

Viral Video: రోజూ స్కూలుకొచ్చి.. బుద్ధిగా పాఠాలు వింటున్న కొండముచ్చు!

ఇంటర్నెట్ డెస్క్: పిల్లలే బుద్ధిగా స్కూల్‌కు వెళ్లరు. కానీ అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే కొండముచ్చు మాత్రం ఎంతో క్రమశిక్షణతో ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్తోంది. అంతేకాదూ.. తరగతి గదుల్లో కూర్చుని.. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా ఆలకిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంటోందనే వివరాల్లోకి వెళితే..



జార్ఖండ్-బిహార్(Jharkhand-Bihar) సరిహద్దుల్లో గల కొండల నడుమ ఓ పాఠశాల ఉంది. అక్కడకు ఓ కొండముంచు గత శనివారం నుంచి క్రమం తప్పకుండా వెళ్తూ బుద్ధిగా పాఠాలు వింటోంది. విద్యార్థులు అంతా టీచర్ చెప్పిన విషయాలను నోట్ చేసుకుంటూ ఉంటే.. ఆ కొండముంచు మాత్రం పిల్లల పుస్తకాల్లోకి తొంగి చూస్తోంది. విద్యార్థులు తరగతి బయటకు వెళ్తే అది కూడా వారితోపాటే అవతలికి వెళ్తోంది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(Viral) అవుతోంది. ఈ క్రమంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ స్పందించారు. శనివారం ఉదయం కొంచముంచు పాఠశాలకు మొదటిసారిగా వచ్చి.. తరగతి గదిలో కూర్చుందన్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తిరిగి సోమవారం నాడు స్కూల్ ఓపెన్ అయిందన్నారు. అప్పుడు కూడా కరెక్టుగా క్లాస్ టైంకు కొండముచ్చు తరగతికి వచ్చిందన్నారు. అక్కడున్న టీచర్లు దాన్ని చూసి భయపడితే.. అది వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే అది వారికి చిక్కలేదన్నారు. ఈ క్రమంలోనే బుధవారం రోజు కూడా ఆ కొండముచ్చు పాఠశాలను సందర్శించి.. తనకు ఇష్టం వచ్చిన తరగతిలో కూర్చుందని అన్నారు. 




Updated Date - 2022-09-16T19:20:08+05:30 IST