మూడు నెలల పాప అదృశ్యం.. భార్య మీదే ఆ భర్తకు డౌట్.. ఆమె ఫోన్ తీసుకుని చెక్ చేస్తే బయటపడిన బండారం..!

ABN , First Publish Date - 2021-10-23T20:35:00+05:30 IST

అప్పటి వరకూ ఇంట్లోనే ఉన్న మూడు నెలల పాప అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు పాప కోసం చుట్టుపక్కల వారిని విచారించారు. అయినా ఆ పాప ఆచూకీ లభించలేదు. దీంతో ఆ పాప తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు రం

మూడు నెలల పాప అదృశ్యం.. భార్య మీదే ఆ భర్తకు డౌట్.. ఆమె ఫోన్ తీసుకుని చెక్ చేస్తే బయటపడిన బండారం..!

ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకూ ఇంట్లోనే ఉన్న మూడు నెలల పాప అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు పాప కోసం చుట్టుపక్కల వారిని విచారించారు. అయినా ఆ పాప ఆచూకీ లభించలేదు. దీంతో ఆ పాప తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ప్రాంతానికి చెందిన అర్పిత్.. స్వాతి అనే మహిళను 2019లో వివాహం చేసుకున్నాడు.  ఈ దంపతులు ఈ ఏడాది జులై 6న వీరతికి జన్మనిచ్చారు. ఈ క్రమంలో ఇంట్లో పడుకున్న వీరతి అక్టోబర్ 12న అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో కుటంబ సభ్యులు ఆందోళన చెందారు. వీరతి ఆచూకీ కోసం  చుట్టుపక్కల వారిని విచారించారు. అయినప్పటకీ వీరతి జాడ తెలియకపోవడంతో.. అర్పిత్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంటిని జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో వీరతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. విగత జీవిగా పడి ఉన్న వీరతిని చూసి.. కుటుంబ సభ్యులు  శోకసంద్రంలో మునిగిపోయారు. 



కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణ సందర్భంగా అర్పిత్ తన భార్య స్వాతిపై అనుమానం వ్యక్తం చేశాడు. తన భార్యే వీరతిని హత్య చేసి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు స్వాతిని విచారించారు. ఆమె ఫోన్‌ను పరిశీలించి పోలీసులు కంగుతిన్నారు. జులై 26 నుంచీ పిల్లలను చంపడం ఎలా అనే సమాచారం కోసం స్వాతి యూట్యూబ్‌లో సర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరతి చనిపోవడానికి రెండు రోజుల ముందు అంటే.. అక్టోబర్ 10న కూడా స్వాతి తన ఫోన్‌లో పిల్లలను ఎలా చంపొచ్చు అనే అంశంపై సర్చ్ చేసినట్టు పోలీసులు కనుగొన్నారు. దీంతో పోలీసులు స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు.. స్వాతి మానసిక ఆరోగ్యం బాగాలేక పోవడం వల్ల ఈ దారుణానికి పూనుకుందా లేక ఇంట్లో సమస్యల కారణంగా ఈ పని చేసిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. 




Updated Date - 2021-10-23T20:35:00+05:30 IST