చెత్త కుప్పలో ఏదో కదులుతున్నట్టుగా అనిపించడంతో దగ్గరకు వెళ్లి చూసిన స్థానికులకు షాక్.. మూటను బయటకు తీసి చూస్తే..

ABN , First Publish Date - 2021-09-19T00:34:14+05:30 IST

భూమి మీదకు చేరి.. 24 గంటలైనా గడవకముందే ఓ చిన్నారి అమ్మ ఒడికి దూరమైంది. ఆడపిల్లను కనడం భారమనుకుందో లేక.. చెడు తిరుగుళ్లు తిరడగం వల్ల పుట్టిన బిడ్డను వదిలించుకోవాలని అనుకుందో తెలియదు కానీ.. ఆ తల్లి మాత్రం తన కూతు

చెత్త కుప్పలో ఏదో కదులుతున్నట్టుగా అనిపించడంతో దగ్గరకు వెళ్లి చూసిన స్థానికులకు షాక్.. మూటను బయటకు తీసి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: భూమి మీదకు చేరి.. 24 గంటలైనా గడవకముందే ఓ చిన్నారి అమ్మ ఒడికి దూరమైంది. ఆడపిల్లను కనడం భారమనుకుందో లేక.. చెడు తిరుగుళ్లు తిరడగం వల్ల పుట్టిన బిడ్డను వదిలించుకోవాలని అనుకుందో తెలియదు కానీ.. ఆ తల్లి మాత్రం తన కూతురి పట్ల అతికర్కశంగా వ్యవహరించింది. ప్రస్తుతం ఆ పాప ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇందుకు సంబంధించిన వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..



ఉత్తర ప్రదేశ్‌లోని ఆడంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చక్ఫేరి గ్రామంలోని ప్రజలు ఎప్పటిలాగే తమ తమ పనులకు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలో ఏదో కదులుతున్నట్లు గుర్తించారు. దీంతో స్థానికంగా ఉన్న కొందరు.. ఆ చెత్త కుప్పను పరిశీలించారు. ఈ క్రమంలో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. జన్మించి సరిగ్గా 24 గంటలైనా నిండని పాపను చెత్త కవర్‌లో చూసి కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా పాపను స్థానిక మహిళల సహాయంతో శుభ్రపరిచారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పాపను స్వాధీనం చేసుకుని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. కాగా.. పాపకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆ చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. చెత్త కవర్ ద్వారా ఇన్‌ఫెక్షన్ పాప ఊపిరితిత్తులకు చేరినట్టు వెల్లడించారు. దీంతో పాపకు ఊపిరందడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2021-09-19T00:34:14+05:30 IST