Advertisement

ఆకట్టుకుంటోన్న ‘ఏ’ రాపిడ్ ట్రైలర్

Mar 2 2021 @ 15:53PM

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ‘ఏ’. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ప్రోమోస్ అన్నీ అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ చిత్ర ట్రైలర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. అలాగే చిత్రంలోని కొంత భాగాన్ని చూసిన విజయ్ సేతుపతి.. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలపడం విశేషం. తాజాగా 'ఏ' చిత్రానికి సంబంధించిన రాపిడ్ కట్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

 

‘యుద్ధానికి కావాల్సింది గమ్యం.. అది తిరిగిరాలేనిదైనా నాకు సంతోషమే..’ అంటూ ఇంటెన్స్ డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు సినిమా ఏ రేంజ్‌లో తెరకెక్కిందో తెలిపేలా ఉంది. విభిన్న చిత్రాలను కోరుకుంటున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ఫుల్ మీల్స్ ఇవ్వబోతుంది అనేలా ఈ రాపిడ్ ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రైలర్ చూసిన ఎవరైనా.. ఖచ్చితంగా థ్రిల్ అవ్వడంతో పాటు సినిమా కోసం వెయిట్ చేయడం ఖాయం. ఈ తరహా చిత్రం ఈ మధ్య కాలంలో అయితే రాలేదు అనేలా ఈ ట్రైలర్ చెప్పేస్తోంది. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని పి.వి.ఆర్‌.పిక్చర్స్ గ్రాండ్‌గా విడుదల చేస్తుంది. విజయ్ కురాకుల సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.