ltrScrptTheme3

అబ్బాయిలు అమ్మాయిలకు కనెక్ట్‌ అయ్యే సినిమా

Oct 26 2021 @ 05:07AM

‘‘వరుడు కావలెను’ ఈతరం అబ్బాయిలు, అమ్మాయిలకు కనెక్ట్‌ అయ్యే సినిమా. అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకు నచ్చుతారనేది ఈ సినిమా చూసి ఫాలో అవ్వచ్చు. సినిమా ఆద్యంతం ఆహ్లాదంగా ఉంటుంది. థియేటర్‌లో ప్రశాంతంగా ఆనందంగా నవ్వుతూ చూసే సినిమా ఇది’’  అని దర్శకురాలు లక్ష్మీసౌజన్య అన్నారు. ఆమె దర్శకత్వంలో నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 29న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను లక్ష్మీసౌజన్య పంచుకున్నారు. 


మా సొంతూరు నరసరావు పేట. నలుగురిలో నాకంటూ ప్రత్యేకత ఉండాలనుకుంటాను. ఇంట్లో పెళ్లి చేస్తాను అన్నారు. కానీ సినీరంగంలో రాణించాలని హైదరాబాద్‌ వచ్చాను. దర్శకులు తేజ, కృష్ణవంశీ, శేఖర్‌ కమ్ముల, ప్రకాష్‌ కోవెలమూడి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఇండస్ట్రీలో 15 ఏళ్ల జర్నీ తర్వాత ‘వరుడు కావలెను’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నాను. 


2017లో నిర్మాత చినబాబుగారికి ఈ కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. కరోనా పరిస్థితుల వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. హారికా హాసిని క్రియేషన్స్‌లాంటి పెద్ద బ్యానర్‌లో తొలి చిత్రం డైరెక్ట్‌ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నాచుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాల నుంచే కథలు రాసుకుంటాను. ఒక సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఉన్న అమ్మాయిని చూసినప్పుడు ఈ కాన్సెప్ట్‌ అనుకున్నాను. తొలిచిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యామిలీ సబ్జెక్ట్‌ ఎంచుకున్నాను. 


ఒక అమ్మాయి ప్రేమించదగ్గ అన్ని క్వాలిటీస్‌ నాగశౌర్యలో ఉన్నాయి. అందుకే మొదటి నుంచి నాగశౌర్యనే ఈ చిత్రంలో హీరోగా అనుకున్నాను. అలాగే హీరోయిన్‌ పాత్ర పేరు భూమి. మంచి క్వాలిటీస్‌ ఉన్న అమ్మాయి. హీరో పాత్ర పేరు ఆకాష్‌. విశాలహృదయం ఉన్న వ్యక్తి. మనం ఎంచుకున్న క్యారెక్టరైజేషన్స్‌, నేపథ్యం వల్ల సీన్స్‌ కొత్తగా మారతాయి. అవే సినిమాకు కొత్తదనాన్ని తెస్తాయి. ఈ సినిమాలో అలాంటి కొత్తదనం ఉంది. ఆధార్‌కార్డ్‌ నేపథ్యంలో నా తదుపరి చిత్రానికి కథ రాసుకున్నాను. 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.