వనమా రాఘవేంద్రపై హత్యకేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-01-06T05:30:00+05:30 IST

వనమా రాఘవేంద్రపై హత్య, ఫోక్సో కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్‌ చేశారు.

వనమా రాఘవేంద్రపై హత్యకేసు నమోదు చేయాలి
జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంపై కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

 నైతిక బాధ్యతగా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలి

రాఘవేంద్ర మాఫియా సామ్రాజ్యంపై చర్యలు తీసుకోవాలి

ఎన్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు  

 పోలీసుల సహకారంతోనే నేరాలు: కాంగ్రెస్‌

 కొవ్వొత్తుల  ప్రదర్శనతో నిరసన

ఖమ్మంసంక్షేమవిభాగం, జనవరి6: వనమా రాఘవేంద్రపై  హత్య, ఫోక్సో కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్‌ చేశారు. గురువారం ఎన్డీ అధ్వర్యంలో ఖమ్మంలో వనమా రాఘవేంద్ర దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కుమారుడి అరాచకాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార పార్టీని అడ్డుపెట్టుకొని రాఘవేంద్ర అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగారని ఆరోపించారు. రామకృష్ణ కుటుంబ సభ్యులు అందర్ని పొట్టన పెట్టుకున్నారని గతంలో అనేక మంది బాధితులు ఉన్నారని గుర్తు చేశారు. అనేక మంది మహిళలపై ఆఘాయిత్యలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాయల చంద్రశేఖర్‌, ఆవుల వెంకటేశ్వర్లు, శిరోమణి, రామయ్య, పుల్లయ్య, కే.శ్రీనివాస్‌, ఆజాద్‌, ఝాన్సీ, ఆవుల మంగతాయి, చందు, సుభాన్‌, సూర్యనారాయణ, లక్ష్మణ్‌; సైదమ్మ, కొటమ్మ, ఎల్లమ్మ, సతీష్‌, రాకేష్‌ పాల్గొన్నారు.

పోలీసుల సహకారంతోనే ఆగడాలు

 జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంపై కొవ్వోత్తులతో ప్రదర్శనతో నిరసన

ఖమ్మంసంక్షేమవిభాగం: వనమా రాఘవేంద్రపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని  జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎండీ జావీద్‌, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర రావు, నాయకులు రాయల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కొత్తగూడెంలో గతంలో అనేక మంది రాఘవేంద్ర బాధితులు షూసైడ్‌ నోట్లు రాసి ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు, యంత్రాంగం సహాకారంతో రాఘవేంద్ర ఇన్ని రోజులు తప్పించు కున్నాడని ఆరోపించారు. ఇటువంటి సంఘటలనకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.  ఖమ్మంలో ముస్తాఫాపై అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్టు పెట్టారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నాయకులకు పోలీసులు  అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముస్తాఫా విడుదల సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో నాయకులు కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మిక్కిలినేని మంజుల, రఫేదాబేగం, నాయకులు మిక్కిలినేని నరేంద్ర, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.

వనమా రాఘవను కఠినంగా శిక్షీంచాలి 

రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళ ఉపాధ్యక్షురాలు మంజుల 

కారేపల్లి : వనమారాఘవను అధికారులు కఠినంగా శిక్షీంచాలని తెలంగాణ రాష్ట్రకాంగ్రెస్‌ మహిళ ఉపాఽధ్యక్షురాలు పగడాల మంజుల అన్నారు.గురువారం ఆమె మాట్లాడుతూ పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొవడానికి ఆయనే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు పార్వతి, మహిళనాయకురాళ్లు చాయదేవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-06T05:30:00+05:30 IST