రేషన్‌ పంపిణీ వ్యవస్థలో నూతన శకం

ABN , First Publish Date - 2021-01-22T06:39:31+05:30 IST

రేషన్‌ పంపిణీ వ్యవస్థలో నూతన శకానికి సీఎం జగన్‌ నాంది పలికారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.

రేషన్‌ పంపిణీ వ్యవస్థలో నూతన శకం
వాహనాలను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప

డిప్యూటీ సీఎం నారాయణస్వామి


చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 21: రేషన్‌ పంపిణీ వ్యవస్థలో నూతన శకానికి సీఎం జగన్‌ నాంది పలికారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. గురువారం ఇంటికే రేషన్‌ పంపిణీ కోసం నిర్దేశించిన 724 వాహనాలను చిత్తూరు మెసానికల్‌ మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రేషన్‌ షాపుల వద్ద క్యూలైన్లకు స్వస్తి చెబుతూ.. ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు అందిస్తామన్నారు. కళ్లెదుటే ఇంత అభివృద్ధి జరుగుతున్నా చంద్రబాబు, ఇతర నేతలకు కనిపించడం లేదన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ.. వాహనాలను డ్రైవర్లు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అనంతరం పది కిలోల బియ్యం బ్యాగులను లాంఛనంగా ప్రముఖులు ఆవిష్కరించారు. తొలుత బీఎస్‌ కణ్ణన్‌ కళాశాల నుంచి మెసానికల్‌ మైదానం వరకు వాహనాల ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యేలు ఎం.ఎస్‌బాబు, ద్వారకనాథరెడ్డి, జేసీలు మార్కొండేయులు, వీరబ్రహ్మం, చిత్తూరు, బంగారుపాళ్యం మార్కెట్‌ కమిటీ చైర్మన్లు కృష్ణారెడ్డి, లావణ్య ప్రకాష్‌, పాల ఏకిరి కార్పొరేషన్‌ చైర్మన్‌ మురళి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T06:39:31+05:30 IST