నరసాపురంలో కొత్త స్తంభం వేశారు..

ABN , First Publish Date - 2021-08-03T05:52:37+05:30 IST

మండలంలోని నరసాపురం గ్రామంలో కొత్త విద్యుత్‌ స్తంభాన్ని ఏర్పాటు చేశారు.

నరసాపురంలో కొత్త స్తంభం వేశారు..
కొత్త స్తంభం ఏర్పాటు చేయిస్తున్న ఏడీఈ, ఏఈ

విద్యుత్‌ సమస్యపై స్పందించిన అధికారులు

వ్యవసాయ మోటార్లకు కరెంట్‌ సరఫరా పునరుద్ధరణ

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌


చోడవరం, ఆగస్టు 2: మండలంలోని నరసాపురం గ్రామంలో కొత్త విద్యుత్‌ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ స్తంభం విరిగిపోవడంతో వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ఈపీడీసీఎల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని ‘విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం... అన్నదాతకు శాపం’ అనే శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై నర్సీపట్నం ఈపీడీసీఎల్‌ ఈఈ సురేశ్‌బాబు స్పందించారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఈపీడీసీఎల్‌ ఏడీఈ ఆనంద్‌, రూరల్‌ ఇన్‌చార్జి ఏఈ వంశీలు నరసాపురం చేరుకుని విరిగిన విద్యుత్‌ స్తంభం స్థానంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయించి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. దీంతో రైతుల వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ సరఫరా ప్రారంభమైంది. తమ గ్రామంలో విద్యుత్‌ సమస్యపై స్పందించిన ‘ఆంధ్రజ్యోతి’కి, సరఫరా పునరుద్ధరించిన అధికారులకు స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-08-03T05:52:37+05:30 IST