జంతు ప్రపంచంలోకి కొత్తజీవి!

Jun 7 2021 @ 00:00AM

ఎన్నో కప్పలు చూసుంటారు. కానీ ఈ కప్పను చూడటం మాత్రం ఇదే మొదటిసారి. అందుకే శాస్త్రవేత్తలు ఆ కప్ప పేరును జంతు ప్రపంచంలోకి చేర్చారు. ‘చాక్లెట్‌ ఫ్రాగ్‌’ అని పిలుస్తున్న ఆ కప్ప విశేషాలివి...


  1. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దీవి అయిన న్యూ గినియాలోని దట్టమైన అడవుల్లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఒక కప్పను గుర్తించారు. చెట్లపై నివసించే ఆ కప్పను చాక్లెట్‌ ఫ్రాగ్‌ అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. 
  2. చాక్లెట్‌ రంగులో ఉండటం వల్ల దానికి ఆ పేరు పెట్టారు. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త స్టీవ్‌ రిచర్డ్స్‌ దీన్ని మొదట గుర్తించారు. పరిశోధన కోసం కప్ప నుంచి కొన్ని స్పెసిమన్స్‌ సేకరించారు. అధ్యయనం తరువాత జంతు ప్రపంచంలోకి కొత్త జీవి వచ్చి చేరినట్టుగా ప్రకటించారు. 
  3. ఈ కప్పకు లాటిన్‌ భాషలో లిటోరియా మీరా అని పేరు. చెట్లపై నివసించే కప్పలు ఆకుపచ్చరంగు చర్మం కలిగి ఉంటాయి. కానీ ఈ కప్ప చర్మం చాక్లెట్‌ రంగులో ఉండడం విశేషం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.