సాయంత్రం వేళ పాడుబడ్డ బంగళా నుంచి చిన్నారి ఏడుపు శబ్దం.. అక్కడ కనిపించిన సీన్ చూసి స్థానికులు షాక్.. వెంటనే..

ABN , First Publish Date - 2022-01-08T20:57:36+05:30 IST

అదో పాడుపడ్డ బంగళా. చూడటానికే భయానకంగా ఉండే ఆ ఇంటి వైపు సాధారణంగా ఎవరూ వెళ్లరు. అయితే శుక్రవారం రోజు ఆ ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపు శబ్దం రావడంతో స్థానికులు

సాయంత్రం వేళ పాడుబడ్డ బంగళా నుంచి చిన్నారి ఏడుపు శబ్దం.. అక్కడ కనిపించిన సీన్ చూసి స్థానికులు షాక్.. వెంటనే..

ఇంటర్నెట్ డెస్క్: అదో పాడుపడ్డ బంగళా. చూడటానికే భయానకంగా ఉండే ఆ ఇంటి వైపు సాధారణంగా ఎవరూ వెళ్లరు. అయితే శుక్రవారం రోజు ఆ ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపు శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏకదాటిగా ఏడుపు శబ్దం వస్తూ ఉండటంతో ఇంటి వైపు వెళ్లారు. అనంతరం ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి స్థానికులు హడలిపోయారు. వెంటనే ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి, విషయం చెప్పారు. కాగా.. ఆ ఇంట్లో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గోవింద్‌పురా అనే కాలనీ ఉంది. ఈ కాలనీలో ఒక పాడుబడ్డ బంగళా ఉంది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు.. ఆ పాడుబడ్డ ఇంటి నుంచి చిన్నారి ఏడుపు శబ్దం వినిపించడంతో స్థానికులు కంగారుపడ్డారు. విషయం తెలుసుకునేందుకు ఆ ఇంట్లోకి వెళ్లి చూశారు. అక్కడ కొన్ని గంటల ముందే పుట్టిన ఓ పసికందును చూసి ఉలిక్కిపడ్డారు. ఆ చిన్నారి పరిస్థితి నివ్వెరపోయిన స్థానికులు.. వెంటనే ఎమర్జెన్నీ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆ శిశువును ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ శిశువుకు జన్మనిచ్చిన మహిళ కోసం దర్యాప్తు చేస్తున్నారు.




Updated Date - 2022-01-08T20:57:36+05:30 IST