PM Modi స్ఫూర్తితో చాయ్‌వాలాగా మారిన NRI.. ఈయన జీవితమే ఓ ఛాలెంజ్

Sep 19 2021 @ 07:16AM

వెల్లింగ్టన్: జగదీష్ కుమార్ ఓ ఎన్నారై. న్యూజిల్యాండ్‌లో మంచి ఉద్యోగం. అద్భుతమైన కెరీర్. సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని వదులుకుని భారత్ తిరిగి వచ్చి చాయ్‌వాలాగా మారాడాయన. జగదీష్‌ను ఇలా చాయ్‌వాలాగా మార్చింది ఎవరో తెలుసా..? మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. మీరు చదివింది నిజమే. ఆయన అన్నీ వదులుకుని భారత్ వచ్చి టీ గురించి తెలుసుకుని, ఇక్కడ టీ బిజినెస్ ప్రారంభించడానికి ప్రధాని మోదీనే స్ఫూర్తి. ఇదే విషయాన్ని జగదీష్ ఎప్పుడూ చెబుతారు.

కుటుంబంలో ఈ వ్యాపారినికి సంబంధించి ఒక్కరు కూడా టీ వ్యాపారంలో లేరు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎవరికీ తెలియదు. దీంతో మొదట్లో ఎన్నో ఎదురు దెబ్బులు తినాల్సి వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన తన ఎన్నారై స్టేటస్‌ను కూడా వదులుకుని ఇక్కడకు వచ్చి వ్యాపారంలో దిగారు. మిగిలిపోయిన ఆహారం తింటూ, పాత్రలు తోముకుంటూ జీవితాన్ని వెళ్లదీశారు. కానీ అన్ని కష్టాలలోనూ వెనక్కి తగ్గకుండా తన లక్ష్యం కోసం పనిచేశారు. ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారానికి అధినేతగా మారారు.

జగదీష్ ఇప్పుడు కేవలం ఓ సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్ మాత్రమే కాదు.. దేశంలోని ఎన్నో పెద్ద పెద్ద సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. యువత ఆత్మనిర్భర్‌(తమ కాళ్లపై తాము నిలబడేలా) చేసేందుకు వారు స్టార్ట్‌ అప్ బిజినెస్‌లు మొదలు పెట్టే విధంగా స్ఫూర్తి నింపుతున్నారు. ‘భారతీయులను స్టార్ట్‌ అప్ కంపెనీలు ప్రారంభించే విధంగా తయారుచేయాలనుకుంటున్నాను. దీని వల్ల దేశంలో నిరుద్యోగిత తగ్గిపోతుంది. భారత స్టోర్లు అంతర్జాతీయంగా గుర్తింపు రావాలనేదే నా కోరిక.’ అని జగదీష్ చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆయనకు హింత్ రతన్ అవార్డ్ కూడా దక్కింది. ఆయన జీవితంపై ఓ పుస్తకం రాయడం జరిగింది. త్వరలో ఆయన బయోపిక్ కూడా రాబోతోంది.

అంతేకాకుండా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో గొప్ప కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని ఆయన దేశాన్ని ఎంతో మందుకు తీసుకెళతారని జగదీష్ నమ్ముతారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే తాను ఎన్నారై స్టేటస్‌ను సైతం వదిలి ఇలా చాయ్‌వాలాగా మారానని జగదీష్ చెబుతారు. ఆయనను ఎప్పుడో ఓ సారి కలిసి దేశంలో ఆయన ప్రవేశపెడుతున్న పథకాలకు, కార్యక్రమాలకు కృతజ్ఞతలు చెప్పాలనేది జగదీష్ కోరిక.


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.