సడన్‌గా పైలెట్‌కు అనారోగ్యం.. తప్పనిసరి పరిస్థితుల్లో విమానం నడిపేందుకు సిద్ధమైన ప్రయాణికుడు.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-11T21:06:47+05:30 IST

విమానంలో ప్రయాణిస్తున్నపుడు అకస్మాత్తుగా పైలెట్ అస్వస్థకు గురై.. ఫ్లైట్‌ను నడపలేని పరిస్థితికి చేరుకుంటే.. సాధారణంగా అందులో ప్రయాణించే వారికి వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో కాళ్లు, చేతులు ఆడవు

సడన్‌గా పైలెట్‌కు అనారోగ్యం.. తప్పనిసరి పరిస్థితుల్లో విమానం నడిపేందుకు సిద్ధమైన ప్రయాణికుడు.. చివరకు..

ఎన్నారై డెస్క్: విమానంలో ప్రయాణిస్తున్నపుడు అకస్మాత్తుగా పైలెట్ అస్వస్థకు గురై.. ఫ్లైట్‌ను నడపలేని పరిస్థితికి చేరుకుంటే.. సాధారణంగా అందులో ప్రయాణించే వారికి వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో కాళ్లు, చేతులు ఆడవు. విమానం కింద పడేలోపే భయాందోళనలతో ప్రాణాలు విడిచే అవకాశం కూడా ఉంటుంది. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. ఓ ప్రయాణికుడు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త చర్చనీయాంశం అయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి తాజాగా Cessna Caravan Flightలో ప్రయాణిస్తుండగా పైలట్ ఒక్కరిగా అస్వస్థకు గురయ్యాడు. ఈ క్రమంలో భయాందోళనలకు గురైన అతడు.. వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు తెలియపరిచాడు. తన పరిస్థితి వివరించి.. సహాయం చేయాల్సిందిగా వారిని కోరాడు. దీంతో స్పందించిన అధికారులు.. అతడికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా విమానాన్ని నడపాలని ప్రోత్సహించారు. దీంతో పైలట్ సీట్లోకి ఎంట్రీ ఇచ్చిన సదరు వ్యక్తి.. అధికారుల సూచనలతో విమానాన్ని సురక్షితంగా ఫ్లోరిడాలోని Palm Beach International Airport‌లో ల్యాండ్ చేశాడు. గతంలో ఫ్లైట్ నడిపిన అనుభవం లేనప్పటికీ అధికారులతో సూచనలతో తన ప్రాణానాన్ని కాపాడుకోవడమే కాకుండా ఫైలట్ ప్రాణాలను కూడా కాపాడి హీరోగా నిలిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 


Read more