విమానంలో ఓ ప్రయాణికుడు కూర్చున్న సీటుపై సిబ్బందికి డౌట్.. దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల కనిపించిన వాటిని చూసి..

ABN , First Publish Date - 2021-11-16T19:57:00+05:30 IST

అది దుబాయ్ నుంచి జైపూర్‌కు వచ్చిన విమానం.. జైపూర్ విమానాశ్రయంలో ఆగగానే కస్టమ్స్ అధికారులు లోపలికి ప్రవేశించారు..

విమానంలో ఓ ప్రయాణికుడు కూర్చున్న సీటుపై సిబ్బందికి డౌట్.. దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల కనిపించిన వాటిని చూసి..

అది దుబాయ్ నుంచి జైపూర్‌కు వచ్చిన విమానం.. జైపూర్ విమానాశ్రయంలో ఆగగానే కస్టమ్స్ అధికారులు లోపలికి ప్రవేశించారు.. ఒక వ్యక్తి‌ని అనుమానంగా చూసి అతను కూర్చున్న సీటును పైకి లేపి చూశారు.. లోపల కేజీన్నర బరువున్న బంగారం బిస్కెట్లు కనిపించాయి.. దీంతో అతడిని, విమాన సిబ్బందిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. అతను సోమవారం దుబాయ్ నుంచి జైపూర్‌కు ఎయిరిండియా విమానంలో వచ్చాడు. తనతో పాటు అక్రమ మార్గంలో కేజిన్నర బంగారాన్ని తీసుకువచ్చాడు. దాన్ని విమానంలో తన సీటు కింద పెట్టుకున్నాడు. ఆ సమాచారం జైపూర్‌లోని కస్టమ్స్ అధికారులకు అందింది. విమానం జైపూర్‌లో ల్యాండ్ కాగానే వారు లోపలికి ప్రవేశించి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి అంత బంగారాన్ని సులభంగా విమానంలోకి తీసుకురాగలిగాడంటే విమాన సిబ్బంది కూడా సహకరించి ఉంటారని కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 



Updated Date - 2021-11-16T19:57:00+05:30 IST