రూ.70వేల స్కూటీ కోసం రూ.15.44లక్షలు ఖర్చు!

ABN , First Publish Date - 2022-04-17T23:09:28+05:30 IST

కొద్ది రోజుల క్రితం అతడు ఓ స్కూటీని కొనుగోలు చేశాడు. తాజాగా ఆ స్కూటీ కోసం ఓ ఫ్యాన్సీ నెంబరును కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మరీ దక్కించుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. స్కూటీ ఖరీదు కంటే ఆ

రూ.70వేల స్కూటీ కోసం రూ.15.44లక్షలు ఖర్చు!

ఇంటర్నెట్ డెస్క్: కొద్ది రోజుల క్రితం అతడు ఓ స్కూటీని కొనుగోలు చేశాడు. తాజాగా ఆ స్కూటీ కోసం ఓ ఫ్యాన్సీ నెంబరును కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మరీ దక్కించుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. స్కూటీ ఖరీదు కంటే ఆ బండి కోసం కొనుగోలు చేసిన నంబర్ ప్లేట్ విలువ ఎన్నో రెట్లు ఎక్కువ. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



చండీగఢ్‌కు చెందిన బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితమే ఓ స్కూటీని రూ.70వేల వెచ్చించి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత CH-01 CJ 0001 అనే ఫ్యాన్సీ నెంబర్‌ ప్లేట్ వేలానికి వచ్చింది. ఆ ప్రకటన చూసి మోహన్.. వేలంలో పాల్గొన్నాడు. ఏకంగా రూ.15.44లక్షలతో ఆ నెంబర్ ప్లేట్‌ను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన పిల్లల కోరిక మేరకే ఈ నెంబర్ ప్లేట్‌ను కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. కొద్ది రోజుల్లో కారును కూడా కొనుగోలు చేసి, ఈ నెంబర్ ప్లేట్‌ను దానికి ట్రాన్సఫర్ చేయిస్తానని పేర్కొన్నారు. కాగా.. రూ.70వేల బండికి రూ.15.44లక్షల నెంబర్ ప్లేట్ కొనుగోలు చేసిన విషయం స్థానికంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 




Updated Date - 2022-04-17T23:09:28+05:30 IST