కలలో వచ్చిన నంబర్‌‌పై లాటరీ టికెట్ కొన్నాడు.. చివరికి జాక్‌పాట్ కొట్టాడు.. ఇంతకీ అతను ఎంత గెలుచుకున్నాడో తెలుసా..

Published: Fri, 01 Jul 2022 21:23:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కలలో వచ్చిన నంబర్‌‌పై లాటరీ టికెట్ కొన్నాడు.. చివరికి జాక్‌పాట్ కొట్టాడు.. ఇంతకీ అతను ఎంత గెలుచుకున్నాడో తెలుసా..

కలలు వివిధ రకాలుగా ఉంటాయి. మంచి కలలు వచ్చిన సమయంలో ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది. అలాంటి కలలే మళ్లీ మళ్లీ రావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తికి లాటరీలో కోట్లు గెలుచుకున్నట్లు కల వచ్చింది. ఈ కల నిజమైతే ఎంత బాగుండు.. అని పొద్దున లేవగానే అనుకున్నాడు. ఓ సారి ట్రై చేద్దాం అని.. కలలో వచ్చిన నంబర్‌పై లాటరీ టికెట్ కొన్నాడు. అయితే ఆశ్చర్యంగా జాక్‌పాట్ కొట్టాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే..

యునైటెడ్ స్టేట్స్‌లో ఉంటున్న అలోంజో కోల్‌మన్ అనే వ్యక్తికి ఇటీవల ఓ కల వచ్చింది. అందులో తాను వర్జీనియా లాటరీ గెలుచుకున్నట్లు, పెద్ద మొత్తంలో నగదు వచ్చినట్లు.. లాటరీ నంబర్‌తో సహా కల వచ్చింది. పొద్దున లేచాక.. రాత్రి వచ్చిన కల గుర్తుకు వచ్చింది. ఓ సారి ట్రై చేస్తే పోలా అని అనుకున్నాడు. వెంటనే కలలో వచ్చిన నంబర్‌పై వర్జీనియా లాటరీ టికెట్‌ని 2డాలర్లు పెట్టి కొన్నాడు. లాటరీ నిర్వాహకులు $1 మిలియన్, $500,000, $250,000.. ఇలా మూడు బహుమతులు ప్రకటించారు.

అంత పెద్ద ప్రమాదం జరిగినా.. రోడ్డుపై ఆసనాలు వేస్తున్న యువకుడు.. వీడికేమైనా పిచ్చా.. అంటున్న నెటిజన్లు..

ప్రతి బుధ, ఆదివారాల్లో లాటరీ నిర్వాహకులు డ్రా తీస్తుంటారు. జూన్ 11న తీసిన డ్రాలో కోల్‌మన్.. $250,000(రూ.1,97,36747)లు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. నిర్వాహకులు గురువారం లాటరీ ఫలితాలను ప్రకటించారు. $250,000 చెక్కుతో దిగిన పొటోను కోల్‌మన్.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పొటో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఓ ట్రక్ డ్రైవర్ తమ లాటరీ ద్వారా $1 మిలియన్(రూ.7,89,00,000.00) జాక్‌పాట్ కొట్టాడని నిర్వాహకులు తెలిపారు.

దుస్తులు కొని Google Pay ద్వారా డబ్బులు చెల్లించిన బాలిక.. మరుసటి రోజే ‘‘ఐ లవ్ యూ’’ అంటూ యువకుడి మెసేజ్.. చివరకు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

రండి మేడమ్! మేము లిఫ్ట్ ఇస్తాం.. అంటూ తల్లీకూతుళ్లను కారు ఎక్కించుకున్నారు.. కాస్త ముందుకు వెళ్లగానే.. Viral Video: మూడు ఫైర్ కొరడాలను.. కళ్లు చెదిరేలా గింగిరాలు కొట్టించి.. ప్రపంచ రికార్డు కొట్టిన ఘనుడు.. చూస్తే ఆశ్చర్యపోతారు..videoViral Video: వావ్! ఈ బుడ్డోడి టాలెంటే వేరు.. ఎంత బాగా మ్యాజిక్ చేశాడో చూడండి..videoఓ కర్రకు దుప్పటిని కట్టి.. అనారోగ్యంతో ఉన్న 75 ఏళ్ల తల్లిని అందులో పడుకోబెట్టి.. 5 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి..!Viral Video: చనిపోయిన తండ్రి పాత దుస్తులను.. మధుర జ్ఞాపకంగా మార్చిన కూతురు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..videoInstagram Reel తెచ్చిన తంటా.. సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి వీడియో చేస్తే దూల తీర్చేసిన పోలీసులు..!
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.