చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2022-08-19T06:25:31+05:30 IST

మిర్యాలగూడ డివిజన పరిధిలో కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ట్లు ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు.

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

 13.5తులాల బంగారం, రూ.1లక్ష స్వాధీనం 

నల్లగొండ టౌన, ఆగస్టు 18: మిర్యాలగూడ డివిజన పరిధిలో కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ట్లు ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. అతని నుంచి 13.5 తులాల బంగారం, 800 గ్రాముల వెండీ, రూ.1లక్ష స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన కందుల సందీప్‌ మెకానిక్‌గా పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. 2014నుంచి దొంగతనాలు మొదలుపెట్టిన సందీ్‌పను 2020లో నకిరేకల్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, 2021 ఫిబ్రవరిలో జైలు నుంచి తిరిగి వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామశివారులో ఎస్‌ఐ శోభనబాబు వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతుండటంతో అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతని వద్ద ది ద్దులు, బుట్టాలు, రూ.5వేల నగదు లభించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు చెప్పినట్లు తెలిపారు. నిందితుడిపై మిర్యాలగూడలో రెండు, నిడమనూరులో మూడు, మఠంపల్లిలో రెండు, తిరుమలగిరిలో రెండు, రంగారెడ్డి జిల్లా ఘ ట్కేసర్‌లో 2 మొత్తం 11 కేసులు నమోదైనట్లు తెలిపారు. అతని నుంచి పదమూడున్నర తులాల బంగారం, 800 గ్రాముల వెండి, రూ.1లక్ష, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 


Updated Date - 2022-08-19T06:25:31+05:30 IST