లైసెన్స్ లేకుండా డ్రైవింగ్... 70 ఏళ్ళలో తొలిసారి పట్టుబడిన వ్యక్తి...

ABN , First Publish Date - 2022-01-30T20:19:25+05:30 IST

పన్నెండేళ్ళ వయసులో డ్రైవింగ్ సొంతంగా నేర్చుకుని, డ్రైవింగ్ టెస్ట్‌లు

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్... 70 ఏళ్ళలో తొలిసారి పట్టుబడిన వ్యక్తి...

లండన్ : పన్నెండేళ్ళ వయసులో డ్రైవింగ్ సొంతంగా నేర్చుకుని, డ్రైవింగ్ టెస్ట్‌లు, లైసెన్సులు వంటివేవీ లేకుండా, 70 ఏళ్ళ పాటు దర్జాగా డ్రైవింగ్ చేసిన వ్యక్తి బుధవారం బ్రిటన్‌లోని, నాటింగ్‌హామ్, బుల్‌వెల్ పోలీసులకు పట్టుబడ్డారు. అదృష్టవశాత్తూ ఆయన యాక్సిడెంట్‌లు చేయలేదని పోలీసులు ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. అయితే ఆయనకు విధించిన శిక్ష గురించి ఈ పోస్ట్‌లో తెలియజేయలేదు. 


పోలీసులు ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, బుధవారం సాయంత్రం బుల్‌వెల్‌లోని టెస్కో ఎక్స్‌ట్రా సమీపంలో గస్తీ తిరుగుతున్న పోలీసు బృందం ఓ కారును ఆపింది. అందులోని డ్రైవర్‌ను ప్రశ్నించినపుడు అవాక్కయ్యే విషయాలు వెల్లడయ్యాయి. తాను పన్నెండో ఏట నుంచి డ్రైవింగ్ చేస్తున్నానని, డ్రైవింగ్ తానే స్వయంగా నేర్చుకున్నానని ఆ డ్రైవర్ చెప్పినట్లు పోలీసులు ఈ పోస్ట్‌లో తెలిపారు. తనకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ లేవని చెప్పినట్లు తెలిపారు. అదృష్టవశాత్తూ ఆయన డ్రైవింగ్ సమయంలో యాక్సిడెంట్లు జరగలేదన్నారు. 


పట్టుబడిన డ్రైవర్ వయసు ప్రస్తుతం 83 సంవత్సరాలు. ఆయన పోలీసులతో మాట్లాడుతూ, తాను పన్నెండో ఏట నుంచి డ్రైవింగ్ చేస్తున్నానని, తనకు లైసెన్సు, ఇన్సూరెన్సు లేవని, అదృష్టశాత్తూ యాక్సిడెంట్లు కూడా జరగలేదని చెప్పారు. ఇది తన అదృష్టం కావచ్చునని చెప్పారు. తనను గతంలో ఎన్నడూ పోలీసులు పట్టుకోలేదన్నారు. తాను పోలీసులకు పట్టుబడటం ఇదే మొదటిసారి అని చెప్పారు. 


Updated Date - 2022-01-30T20:19:25+05:30 IST