ఉపాధి పనుల ఫొటో తప్పనిసరి

ABN , First Publish Date - 2021-04-14T04:16:09+05:30 IST

ఉపాధి హామీ కింద గ్రామీణ ప్రాంతాల్లో చేసిన పలు అభివృద్ధి పనులు చేయని కిందకు వస్తున్నాయి. పలు పనులకు సంబంధించిన ఫొటోలు అధికారుల వద్ద లేక ఇబ్బందు లు ఎదురవుతున్నాయి.

ఉపాధి పనుల ఫొటో తప్పనిసరి
దోమకొండలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు

వర్క్‌ఫైల్‌పై దృష్టి సారించిన అధికారులు
ఫొటో లేక సోషల్‌ ఆడిట్‌లో అభ్యంతరాలు
ఆదేశాలున్నా పట్టని ఈజీఎస్‌ సిబ్బంది
ఫొటోలు తీయని టీఏలకు జరిమానాలు
కామారెడ్డి, ఏప్రిల్‌ 13: ఉపాధి హామీ కింద గ్రామీణ ప్రాంతాల్లో చేసిన పలు అభివృద్ధి పనులు చేయని కిందకు వస్తున్నాయి. పలు పనులకు సంబంధించిన ఫొటోలు అధికారుల వద్ద లేక ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. ఫలితంగా సోషల్‌ఆడిట్‌లో అభ్యంతరాలు తలెత్తడంతో పాటు పనులు చేయనట్లుగా రికార్డులో నమోదవుతు న్నాయి. దీంతో ఉపాధి హామీలో జిల్లాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అయితే దీనిపై దృష్టి సారించిన జిల్లా యం త్రాంగం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈజీఎస్‌ వర్క్‌ఫైల్‌ను పకడ్బం దీగా అమలు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మూడు రకాల ఫొటోలు ఉపాధి హామీ పని ప్రారంభానికి ముం దు, కూలీలు పని చేస్తున్నప్పుడు, పని పూర్తయ్యాక పని ప్రదేశాన్ని (వర్క్‌లొకేషన్‌) ఫొటోలు తీసుకుని వర్క్‌ఫైల్‌లో ఉంచాల్సిందిగా టెక్నికల్‌ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి ఫొటో తీసు కునే విధానం గతేడాది నుంచి అమలవుతున్న సిబ్బంది పట్టన ట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోకేషన్‌ ఫొటోలు లేక సోషల్‌ ఆడిట్‌లో ఇబ్బంది తలెత్తుతుందని, ఈ ఏడాది నుంచి ఫొటోలు తీయని సిబ్బందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిసు ్తన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
టీఏలకు సవాలే..
జిల్లాకు సరిపడా ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్లు లేరు. ఏ రోజు కూలీలు ఏ పని ఎక్కడ ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి. ఆయా మండలాల పరిధిలోని టెక్నికల్‌ అసిస్టెంట్లు ఉపాధి ఫొటో లు తీసుకోవడం ప్రస్తుతం సవాల్‌గా మారింది. జిల్లాలో 526 గ్రా మ పంచాయతీలున్నాయి. 22 మండలాల పరిధిలో 36 మంది టెక్నికల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ఒక్కో మండలానికి ఒకరి నుంచి ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారు. వాస్తవానికి ఒక్కో మండలానికి ఆరుగురు ఉండాల్సి ఉంటుంది. ప్రతీ మండలంలో 6 నుంచి 18 వరకు జీపీలు ఉన్నాయి. ఒక్కో జీపీలో ఉపాధి కూలీల గ్రూపులు 5 నుంచి 15 వరకు ఉపాధి కూలీల గ్రూపులు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో మండలంలో సుమారు ప్రతీ మండలంలో 200 నుంచి 350 వరకు కూలీలు ఉంటారు. అయితే ఏ గ్రూపు ఎక్కడా ఎప్పుడు పని ప్రారంభిస్తుందో తెలియడం కష్టం. దీనికి తోడు మండలానికి కేవలం ఒకరు నుంచి ఇద్దరు మాత్రమే ఉండ డం గమనార్హం. దీంతో ఫొటోలు తీసుకోవడం టీఏలకు ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు.
ఉపాధిలో 60 రకాల పనులు
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద సుమారు 60 రకాల పను లు చేపడుతున్నారు. వ్యవ సాయ భూముల్లో మట్టి, రాళ్లకట్టలు, కాలువల నిర్మాణం, కందకాలు, రాళ్లు ఏరడం, వర్షపునీరు నిల్వ ఉండకుండా చదును చేయడం, నర్సరీల్లో మొక్కలు పెంపకం, సాగు నీటి కాలువల్లో పూడికతీత, ముళ్ల పొదల తొలగింపు, భూగ ర్భ జలాల పెంపుతో పాటు శ్మశానవాటికలు, రైతు కల్లాలు, సెగ్రిగే షన్‌షెడ్లు, మట్టిరోడ్ల నిర్మాణాలు, తదితర పనులు చేస్తున్నారు. 2021-22లో పనులు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యాయి.
ఫొటో తప్పనిసరి
వెంకట మాధవరావు, డీఆర్‌డీఏ పీడీ, కామారెడ్డి
పని ప్రదేశానికి సంబంధించి మూడు రకాల ఫొటోలు లేకపోవడంతో ఆడిట్‌లో ఇబ్బంది వస్తోంది. ఉపాధి పనులకు సంబంధించిన ఫొటోలు తప్పనిసరిగా తీసుకోవాలని టీఏలకు సూచించాం. టీఏలు తక్కువగా ఉండ డం వల్ల పనులను ఇతర సిబ్బందికి అప్పగించే ప్రయత్నం చే యడానికి ఆలోచన చేస్తున్నాం.

Updated Date - 2021-04-14T04:16:09+05:30 IST