ప్రయాణం మధ్యలో చేతులెత్తేసిన పాకిస్థానీ పైలెట్.. విమానం నడపలేనంటూ వాదన.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-01-21T02:24:49+05:30 IST

పాకిస్థాన్‌కు చెందిన పైలెట్ ప్రవర్తన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డ్యూటీ టైం పూర్తైనందువల్ల ఇక విమానం నడపలేనంటూ మార్గం మధ్యలో చేతులెత్తేయడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. పైలెట్ వై

ప్రయాణం మధ్యలో చేతులెత్తేసిన పాకిస్థానీ పైలెట్.. విమానం నడపలేనంటూ వాదన.. తర్వాత ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన పైలెట్ ప్రవర్తన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డ్యూటీ టైం పూర్తైనందువల్ల ఇక విమానం నడపలేనంటూ మార్గం మధ్యలో చేతులెత్తేయడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. పైలెట్ వైఖరిపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ పైలెట్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన పీకే-9754 విమానం ఆదివారం రియాద్ నుంచి ఇస్లామాబాద్‌కు బయల్దేరింది. అయితే వాతావరణ పరిస్థితులు బాగోలేకపోడం వల్ల దమ్మమ్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పరిస్థితి మెరుగు పడిన తర్వాత దమ్మమ్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం బయల్దేరాల్సి ఉండగా.. ఫ్లైట్‌ను నడిపేందుకు పైలెట్ నిరాకరించాడు. తన డ్యూటీ టైం అయిపోయిందని.. ఎట్టి పరిస్థితుల్లో విమానాన్ని నడపనని స్పష్టం చేశాడు. దీంతో ప్రయాణికులు ఆగ్రహానికి లోనయ్యారు. 



పైలట్ విపరీత ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన ప్రయాణీకులు తాము కూడా ఎట్టి పరిస్థితుల్లో విమానం దిగబోమని తేల్చి చెప్పారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి 11 గంటలకల్లా ఇస్లామాబాద్‌కు తీసుకెళ్తామని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి హామీ ఇవ్వడంతో ప్రయాణికులు శాంతించారు. అనంతరం వారి కోసం బస ఏర్పాటు చేసిన హోటల్‌‌కు వెళ్లి, అక్కడ కాలక్షేపం చేశారు. ఈ సందర్భంగా సదరు అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. పైలెట్‌లకు ప్రాపర్ రెస్ట్ లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. అందువల్లే సదరు పైలెట్ విమానాన్ని నడిపేందుకు నిరాకరించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.



Updated Date - 2022-01-21T02:24:49+05:30 IST