తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ ్సలో పేట విద్యార్థులకు చోటు

ABN , First Publish Date - 2022-07-07T06:29:53+05:30 IST

చిన్నవయస్సులోనే సంగీతంలో అత్యంత ప్రతిభను కనబరుస్తున్న సూర్యాపేటకు చెందిన విద్యార్థులు గుగులోతు సాత్విక్‌, గుగులోతు వేదిక్‌లకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ ్సలో పేట విద్యార్థులకు చోటు
విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేస్తున్న వెంకటాచారి

సూర్యాపేట కల్చరల్‌, జూలై 6: చిన్నవయస్సులోనే సంగీతంలో అత్యంత ప్రతిభను కనబరుస్తున్న సూర్యాపేటకు చెందిన విద్యార్థులు  గుగులోతు సాత్విక్‌, గుగులోతు వేదిక్‌లకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. సూర్యాపేటలోని దురాజ్‌పల్లి శ్రీస్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో సాత్విక్‌ ఆరో తరగతి, వేదిక్‌ మూడో తరగతి చదువుతున్నారు. చిన్నారుల తండ్రి శ్యామ్‌కుమార్‌ ప్రముఖ వైద్యుడు, తల్లి ప్రశాంతి సూర్యాపేట అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి. మాస్టర్‌ సాత్విక్‌ కళ్లకు గంతలు కట్టుకుని గిటారుపై 17 నిమిషాల పాటు 12 దేశభక్తి గీతాలను ఆలవోకగా ఆలపించగా, మాస్టర్‌ వేదిక్‌ కూడా కళ్లకు గంతలు కట్టుకొని కీబోర్డుపై 12 దేశభక్తి గీతాలను 15 నిమిషాల పాటు వినిపించి అబ్బురపర్చారు. ఈ సోదరులు అతిపిన్న వయస్సులో కీబోర్డు, గిటారు వాయించడం అరుదైన అంశంగా ఇద్దరి పేర్లను తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేశారు. బుధవారం ధ్రువీకరణ పత్రాలను శ్రీస్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో సాత్విక్‌, వేదిక్‌లకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి అందజేశారు. కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివా్‌స  ఆనంద్‌, చిన్నారుల తల్లిదండ్రులు శ్యాంకుమార్‌, ప్రశాంతి, సూర్యాపేట సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీవాణి, విద్యార్థులు పాల్గొన్నారు.




Updated Date - 2022-07-07T06:29:53+05:30 IST