
తిరుమల: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు లభించింది. ప్రపంచంలోని ఏ ఆలయాల్లో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు టీటీడీకి ఈ అవార్డ్ లభించింది. ఇంగ్లాండ్‌కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఈ అవార్డ్‌ను టీటీడీకి ఇచ్చింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సంస్థ ప్రతినిధి సర్టిఫికెట్ అందజేశారు.