aకాలువలు, చెరువు గట్లపై మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2022-06-25T05:23:34+05:30 IST

ఈ సారి హరిత హారంలో భాగంగా కాలువలు, చెరువుగట్లపై 80శాతం మొక్కలు నాటాలని నిర్దేశించినట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు.

aకాలువలు, చెరువు గట్లపై మొక్కలు నాటాలి


నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 24: ఈ సారి హరిత హారంలో భాగంగా కాలువలు, చెరువుగట్లపై 80శాతం మొక్కలు నాటాలని నిర్దేశించినట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 250 కి.మీ. పొడవునా మల్టీలేయర్‌లో మొక్కలు నాటాలని, అందుకనుగుణంగా నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌, అలీసాగర్‌, రామడుగు ప్రాజెక్టుల కింద ఉన్న మెయిన్‌ కాలువలతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలపై ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. ముందుగా కాలువ స్థలాల్లో హద్దులు నిర్ణయిస్తూ ట్రెంచ్‌ కటింగ్‌ గట్లు ఏర్పాటు చేయాలని వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు ఈనెల ఆఖరు లోగా పూర్తి చేయాలన్నారు. ఇంకొన్ని చోట్ల పనులు ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్‌ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని నెలాఖరులోగా పనులు పూర్తి చేయకపోతే సరెండర్‌ చేస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:23:34+05:30 IST