Sad incident: ఇలాంటి వైద్యులను ఏమనాలి.. పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణి పరిస్థితి చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-07-22T02:43:02+05:30 IST

వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తాం. అందుకు తగ్గట్టుగా ఎంతో మంది వైద్యులు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడుతుంటారు. అలాంటి ఉత్తమ వైద్యులు ఉన్న ఈ..

Sad incident: ఇలాంటి వైద్యులను ఏమనాలి.. పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణి పరిస్థితి చివరకు ఏమైందంటే..

వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తాం. అందుకు తగ్గట్టుగా ఎంతో మంది వైద్యులు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడుతుంటారు. అలాంటి ఉత్తమ వైద్యులు ఉన్న ఈ సమాజంలో.. వైద్య రంగానికే చెడ్డపేరు తెచ్చే విధంగా కొందరు ప్రవర్తిస్తుంటారు. చివరకు మృతదేహాలకు కూడా చికిత్స చేసి, డబ్బులు దండుకునే వైద్యులను కూడా అక్కడక్కడా చూస్తుంటాం. న్యూఢిల్లీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణి పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. అయితే వైద్యులు ఆమెను చేర్చుకోలేదు. చివరకు ఆమె పరిస్థితి చూసి.. స్థానికులు అయ్యో పాపం! అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో సోమవారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే వైద్యులు ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. గర్భిణి బంధువులు ఎంత బ్రతిమాలినా వైద్యులు పట్టించుకోలేదు. దీంతో చేసేదిలేక రాత్రంతా అత్యవసర విభాగం వెలుపలే గడిపారు. పురిటినొప్పులతో కొట్టుమిట్టాడుతున్నా.. వైద్యులు మాత్రం కనికరించలేదు. దీంతో అక్కడే ఉన్న మహిళలంతా కలిసి చీరను అడ్డుగా పెట్టి, గర్భిణికి ఆరుబయటే ప్రసవం చేశారు.

భర్తపై కోర్టులో కేసు వేసేందుకు డబ్బులు అవసరమని.. మేనమామ ఇంటికి వెళ్లిన ఆమె.. చివరకు ఏం చేసిందంటే..


ఈ విషయం పోలీసుల వరకూ చేరడంతో చివరకు ఆమెను ఆస్పత్రిలో చేర్చుకున్నారు.  ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత వైద్యులపై తీసుకున్న చర్యలకు సంబంధించి.. జూలై 25 లోపు తమకు వివరణ ఇవ్వాలని ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

పీటలపై వరుడు.. ఎంతకూ పెళ్లి మంటపానికి చేరుకోని వధువు.. ఫోన్ చేస్తే అసలు నిజం తెలిసి షాక్.. చివరకు ఊహించని సీన్..!





Updated Date - 2022-07-22T02:43:02+05:30 IST